Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభThe Bads of Bollywood: 'ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌'.. ఢిల్లీ హైకోర్టులో మాజీ అధికారికి...

The Bads of Bollywood: ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’.. ఢిల్లీ హైకోర్టులో మాజీ అధికారికి చుక్కెదురు

The Bads of Bollywood Delhi High Court: షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ వెబ్ సిరీస్ పలు విమర్శలతో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వెబ్ సిరీస్‌లో ఈ – సిగ‌రెట్ వాడ‌రంటూ చిత్ర‌ బృందానికి జాతీయ మాన‌వ హక్కుల క‌మిష‌న్ నోటీసులు అందించిన విషయం తెలిసిందే.. అయితే ఈ వివాదం ముగియ‌క‌ముందే సిరీస్‌పై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో మాజీ అధికారి సమీర్‌ వాంఖడే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-viral-fever-health-update-hyderabad-tests/

‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’లో యాంటీ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో పాటు అధికారుల‌ను చెడుగా చూపించారని పిటిషన్‌లో సమీర్ వాంఖడే పేర్కొన్నారు. ఈ సిరీస్‌తో తన పరువుకు భంగం కలిగిందని.. అందుకు గాను ప‌రువు న‌ష్టం కింద‌ రూ. 2 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అయితే ఈ కేసు విష‌యంలో సమీర్‌ వాంఖడేకి చుక్కెదురైంది. 

సమీర్‌ వాంఖడే వేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు.. వాంఖ‌డే త‌ర‌ఫు న్యాయ‌వాదిని ప్ర‌శ్నించింది. ఈ పిటిష‌న్‌ని ఢిల్లీలోనే ఎందుకు విచారించాల‌ని అడిగింది. దీనిపై బదులిచ్చిన న్యాయవాది.. ఈ సిరీస్ ఢిల్లీతో పాటు దేశ‌వ్యాప్తంగా ప్ర‌సార‌మ‌వుతుందని చెప్పారు. ఈ సిరీస్‌ను చూసి ప‌లువురు నెటిజ‌న్లు వాంఖ‌డేపై వ్యంగ్యంగా మీమ్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇవి ఎక్కువగా ఢిల్లీలోనే క‌నిపిస్తున్నాయంటూ ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకువచ్చారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-og-movie-hd-leak-fans-reaction/

అయితే దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ‘మీరు వేసిన పిటిష‌న్ స‌రికాదు. దీనిని మేం విచారించ‌లేం. మీకు ఢిల్లీ నుంచే ఎక్కువ న‌ష్టం క‌లిగింద‌ని భావిస్తే అందుకు అనుగుణంగా పిటిష‌న్‌ని వేయండి. అప్పుడు పరిగణనలోకి తీసుకుంటాం.’ అంటూ కోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad