Megha Thakur : సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న వయస్సులోనే ఎంతో మంది సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. ఆత్మవిశ్వాసం, బాడీ పాజిటివిటీ గురించి భారత సంతతికి చెందిన మేఘ ఠాకూర్(21) టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేసి సెలబ్రెటీ హోదాను సంపాదించుకుంది. ఆమె వీడియోలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సెలబ్రెటీల డ్రెస్సింగ్‌ను, వాళ్ల ఆటిట్యూడ్‌ను రిఫరెన్స్‌గా తీసుకుని ఆమె చేసే వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారేవి. సోషల్ మీడియాలో ఎంతో గుర్తింపు దక్కించుకున్న మేఘ ఠాకూర్ ఇక లేదు. నవంబర్ 24న ఆమె కన్నుమూసినట్లు మేఘ తల్లిదండ్రులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.
2001 జులై 17న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో మేఘ ఠాకూర్ జన్మించింది. ఆమెకు ఏడాది వయస్సు ఉన్నప్పుడే కుటుంబం అంతా కలిసి కెనడాకు వలస వెళ్లింది. ఒంటారియో మేఫిల్డ్ సెకండరీ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వెస్ట్రన్ యూనివర్సిటీలో చేరింది. టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్‌లు చేసి సెలబ్రెటీగా మారింది. టిక్‌టాక్‌లో 9.3 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను లక్ష మంది ఫాలో అవుతున్నారు.
భారమైన హృదయంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. నవంబర్ 24న మా కంటి వెలుగు అయిన మేఘా ఠాకూర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. అంటూ మేఘ తల్లిదండ్రులు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. అయితే.. ఆమె ఎలా చనిపోయిందన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. 21ఏళ్ల వయసులోనే మరణించడంతో మేఘ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు.