Tuesday, January 7, 2025
Homeచిత్ర ప్రభGunde Ninda Gudigantalu January 6th Episode: సంజు అసలు రూపం తెలుసుకున్న మౌనిక.. బాధలో...

Gunde Ninda Gudigantalu January 6th Episode: సంజు అసలు రూపం తెలుసుకున్న మౌనిక.. బాధలో అన్నచెల్లెల్లు.. తిప్పలు తప్పవా

ఈరోజు ఎపిసోడ్‌లో పాపం మౌనిక సంజు గురించి నిజం తెలియక బెడ్ రూమ్ లోకి పాలు తీసుకొని వెళ్తుంది. ఏంటే అక్కడే నుంచున్నావు, నువ్వు ఏమైనా విఐపీవా అని సంజు అంటాడు. పాలు తాగే టైం ఆ ఇది. అయినా ఫస్ట్ నైట్ అంటే పాలు ఏ పంచుకోవాలా బెడ్ పంచుకుందాం అని చెయ్యి పట్టి లాగుతాడు. మీ అన్నయ్యను కొట్టిన చెయ్యిని కాల్చుకున్నావా.. వద్దు ఈ చెయ్యి అంటే నాకిష్టం కావాలంటే ఇంకో చేయికి చేసుకో అంటాడు. ఎందుకంటే ఈ చెయ్యి బాలును కొట్టిన చెయ్యి కదా అనగానే మౌనిక షాక్ అవుతుంది. ఈ ప్రపంచంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీ అన్నయ్యే అంటాడు. అందుకే వాడు మీ బాలు, రవి, శ్రుతి, మీనా నా శత్రువులు అంటాడు సంజు. మీ అన్నయ్యను ప్రతిరోజు బాధపడేలా చేస్తాను అప్పుడే నాకు మజా అందుకే నీ మెడలో పసుపు తాడు కట్టి ఇక్కడికి లాక్కొచ్చా అంటాడు.

- Advertisement -

ఇప్పుటి నుంచి నీకు రోజుకొక శిక్ష పడుతుంది. ఇక్కడ దెబ్బ పడితే వాడు అక్కడ గిలగిల్లాడాలి అంటాడు. నువ్వు ఈ ఇంటి కోడలు కాదు నా పర్సనల్ పనిమనిషివి. షాక్‌లో మౌనిక నీ గురించి బాగా అర్ధమైంది. నువ్వు ఇలాంటి వాడివని మా అన్నయ్య ఎంత చెప్పినా వినకుండా చెయ్యి చేసుకున్నాను అంటుంది. ఇప్పుడే వెళ్లి అందరికీ నిజం చెప్తాను అంటుంది. చెప్పు నీ కాపురం కూలిపోయి, మీ అన్నయ్య జైలుకు పోయి ఇదంతా సర్వనాశనం అయిపోతే మీ నాన్నకి గుండె జబ్బు అంట కదా. పాపం ఇదంతా చూసి మీ నాన్న పోయి, మీ అమ్మ విధవ అయిపోయి కుటుంబం అంతా ముక్కలైపోతుంది అని అంటాడు. వెళ్లు వెళ్లి చెప్పు అంటాడు.

ఆ మాటలకూ మౌనిక గట్టిగ ఏడుస్తుంది. మీ వాడు జైలుకు వెళ్లినా నిన్ను వదిలిపెట్టను అంటాడు. నరకం చూపిస్తాను అంటాడు. మౌనిక జరిగినదంతా గుర్తుతెచ్చుకుని ఏడుస్తుంటే బయట కూర్చున్న నీలకంఠం నవ్వుతూ ఆనందం పడతాడు. కోడలి దగ్గరకు వెళ్తున్న భార్యను కూడా నీలకంఠం ఆపి తిడుతాడు.ఇంట్లో ఏమి జరిగినా నోరు మూసుకుని చూస్తూ ఉండు అంటాడు నీలకంఠం.
బాలు తప్ప తాగి ఇంట్లోకి వస్తుంటే అతన్ని ఇంట్లోకి రానివ్వకుండా ప్రభావతి ఆపుతుంది. కానీ బాలు తాగి అందరూ కోటీశ్వరులన్ని పెళ్లి చేసుకున్నాను. నన్ను ఎవరూ పట్టించుకోరు నా భార్య పూలు అమ్ముకునేది అయినా నాకోసం వచ్చి ఇంటికి తీసుకొచ్చింది అంటాడు బాలు. ఇంట్లో ఏమి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు ఇంట్లో ఉండద్దు అని అంటుంది. ఎవరు ఆపిన వినకుండా అనరాని మాటలు అంటుంది. నా భర్త ఏం నేరం చేశాడు, దొంగతనం చేశాడా, ఊరు అందరినీ మోసం చేశాడా అని మీనా నిలదీస్తుంది. మీరు మీ అత్తయ్యను మధ్యలో జోక్యం చేసుకోవద్దు అన్నారు అదే మాట నేను అంటే బాగోదు అంటుంది ప్రభావతితో, మా ఆయన ఏ కారణం చేత పెళ్లి వద్దు అన్నాడు అని ఆలోచించారా అని అడిగింది. తన ప్రశ్నలకు ఎవరు సమాధానం ఇవ్వకుండా ఉన్నారు. కానీ ఎందుకు తాగడు అని ఆలోచించరే అని ప్రశ్నిస్తుంది. అడ్డుపడిన లక్షలుమింగినోడికి సైతం సమాధానం ఇస్తుంది మీనా. అందరూ లోపలికి వెళ్లిపోతారు. బాలుకి మీనా అన్నం పెట్టి తినమని బ్రతిమాలుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News