Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభDIWALI: ఒకే వీకెండ్‌లో నలుగురు కొత్త డైరెక్టర్ లు, దీపావళి బాక్సాఫీస్‌లో 'డెబ్యూ' ధమాకా!

DIWALI: ఒకే వీకెండ్‌లో నలుగురు కొత్త డైరెక్టర్ లు, దీపావళి బాక్సాఫీస్‌లో ‘డెబ్యూ’ ధమాకా!

Debut Directors: సాధారణంగా పండుగ సీజన్‌ను స్టార్ డైరెక్టర్లు, పెద్ద హీరోలు డామినేట్ చేస్తుంటారు. అలాంటిది, ఈ దీపావళికి (అక్టోబర్ 2025) బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త ట్రెండ్‌కు తెర లేవనుంది. ఒకే వీకెండ్‌లో ఏకంగా నలుగురు కొత్త దర్శకులు తమ తొలి చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.

- Advertisement -

1. నీరజ కోన (Telusu Kada): స్టైలిస్ట్ నుండి ఫిల్మ్ మేకర్‌గా

ప్రముఖ సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్‌గా సుమారు 100 సినిమాలకు పనిచేసిన అనుభవం నీరజ కోన సొంతం. సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ ‘తెలుసు కదా’ సినిమా ఒక ఫీల్-గుడ్ రొమాంటిక్ డ్రామాగా మన ముందుకు రాబోతుంది. దర్శకురాలిగా మారాలనే కోరిక చిన్నప్పటి నుంచే ఉందని, ఇన్నాళ్ల సినీ అనుభవం తనకు చాలా ఉపయోగపడిందని నీరజ కోన తెలిపారు. తెలుసు కదా అక్టోబర్ 17న రిలీజ్ కాబోతుంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/sai-dharam-tej-allu-arjun-controversy/

2. విజయేందర్ ఎస్ (Mithra Mandali): అనుభవం నుంచి డైరెక్షన్‌లోకి

డైరెక్టర్ అనుదీప్, ‘మ్యాడ్’ కల్యాణ్ వంటి దర్శకుల వద్ద పనిచేసిన అనుభవం విజయేందర్ ఎస్‌కు ఉంది. ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా పూర్తిగా యూత్‌ని ఆకట్టుకునే కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులు ముందుకు రానుంది. సీనియర్ నిర్మాత బన్నీ వాస్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తుండడంతో, ఈ కొత్త డైరెక్టర్‌పై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ‘మిత్ర మండలి’ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతుంది.

3. జైన్స్ నాని (K-Ramp): మాస్ పల్స్ కోసం

హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో తెరకెక్కిన మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘K-Ramp’. గతంలో ‘ఎస్.ఆర్. కల్యాణమండపం’ వంటి విజయవంతమైన సినిమాల నుంచి కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్‌ని దృష్టిలో ఉంచుకుని జైన్స్ నాని ఈ కథను రాసి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మాస్ ఎలిమెంట్స్‌తో పక్కా పండుగ సినిమాగా అక్టోబర్ 18న రిలీజ్ కాబోతోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-og-box-office-collections-hit-or-flop/

4. కీర్తిస్వరన్ (Dude): రజినీకాంత్ స్ఫూర్తితో

తమిళంలో ‘డ్యూడ్’ పేరుతో రూపొంది, తెలుగులో డబ్ అవుతున్న ఈ చిత్రానికి కీర్తిస్వరన్ దర్శకుడు. ‘గురు’ ఫేమ్ సుధా కొంగర వద్ద ఏడేళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఆయనది. ఈ సినిమా కథ రాసేటప్పుడు 30 ఏళ్ల వయసులో రజినీకాంత్ గారు ఈ పాత్ర చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో రాసినట్లు కీర్తిస్వరన్ ఇటీవల వెల్లడించారు. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ. ‘డ్యూడ్’ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కాబోతుంది.

మొత్తంమీద..

సాధారణంగా ఒక పెద్ద పండుగ సీజన్ పెద్ద సినిమాలకు కేటాయించబడుతుంది. కానీ ఈసారి నాలుగు కొత్త కథలు, నలుగురు కొత్త దర్శకులు పోటీ పడుతుండడం, టాలీవుడ్‌లో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి నిర్మాతలు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ఈ దీపావళి వీకెండ్ బాక్సాఫీస్ వద్ద కొత్త దర్శకుల డెబ్యూ ధమాకా ఎలా ఉంటుందో చూడాలి. నాలుగు సినిమాలు విజయం సాధించి, కొత్త టాలెంట్‌కు మరిన్ని అవకాశాలు రావాలని ఆశిద్దాం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad