Nivetha Pethuraj: టాలీవుడ్ హీరోయిన్ నివేథా పేతురాజ్ పెళ్లి కబురు వినిపించింది. కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేసింది. రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రకటించింది. నివేథా పేతురాజ్, రాజ్‌హిత్ ఇబ్రాన్‌ల ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందట. కాబోయే జీవిత భాగస్వామితో నివేథా పేతురాజ్ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది చివరలో పెళ్లి…
రాజ్‌హిత్ ఇబ్రాన్ దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. రాజ్‌హిత్‌తో నివేథాకు చాలా కాలంగా పరిచయం ఉన్నట్లు సమాచారం. ఆ పరిచయం ప్రేమగా మారిందని, పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలో నివేథా పేతురాజ్, రాజ్‌హిత్ పెళ్లి జరగనుందట. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు చెబుతోన్నారు.
Also Read- Heavy rains in telangana: తెలంగాణలో కొనసాగుతున్న భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు డేంజర్ అలర్ట్స్..!
మెంటల్ మదిలో మూవీతో…
శ్రీవిష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన మెంటల్ మదిలో మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నివేథా పేతురాజ్. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, రెడ్, బ్లడీ మేరీ, పాగల్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో మూవీలో ఓ కీలక పాత్ర చేసింది. 2022లో రిలీజైన విశ్వక్‌సేన్ ధమ్కీ సినిమా తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది నివేథా. గ్లామర్ పాత్రలకు దూరంగా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువగా చేసింది. తమిళంలో కొన్ని సినిమాల్లో నటించింది. రెండు భాషల్లో ఆశించిన స్థాయిలో ఆమెకు విజయాలు దక్కలేదు.
పరువు వెబ్ సిరీస్‌లో…
సినిమాలతో పాటు తెలుగులో పరువు అనే వెబ్‌సిరీస్‌లో లీడ్ రోల్ చేసింది నివేథా పేతురాజ్. యాక్టర్‌గానే కాకుండా రేసర్‌గా, బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా సత్తా చాటింది.
స్టాలిన్ కొడుకుతో…
విశ్వక్‌సేన్‌తో నివేథా పేతురాజ్ వరుసగా రెండు సినిమాలు చేసింది. దాంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత తమిళనాడు సీఏం స్టాలిన్ కొడుకు, హీరో ఉదయనిధి స్టాలిన్‌తో నివేథా పేతురాజ్ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికారు చేశాయి. ఈ రూమర్స్‌ను నివేథా కొట్టిపడేసింది.
Also Read- Shruti Haasan: బ్లాక్ డ్రెస్ లో అందాల రచ్చ చేసిన శ్రుతి హసన్


