Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSreeleela: పెళ్లిపై శ్రీలీల ఓపెన్ కామెంట్స్

Sreeleela: పెళ్లిపై శ్రీలీల ఓపెన్ కామెంట్స్

Sreeleela: శ్రీలీల పేరు ఒకప్పుడు టాలీవుడ్‌లో ఎంతలా మార్మోగిందో అందరికీ తెలిసిందే. కానీ వరుస అపజయాలను శ్రీలీల ఫేస్ చేసింది. ఆమెకు విజయాలు దక్కినా, దక్కకపోయినా.. మేకర్స్ మాత్రం ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. స్టార్ హీరోలు, కుర్ర హీరోలకు సరైన జోడిగా శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ మేకర్లకు మంచి ఛాయిస్‌గా ఉంది. గత కొన్ని రోజులుగా శ్రీలీల పెళ్లి గురించి రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్రీలీల తన పెళ్లి గురించి కామెంట్ చేసింది.

- Advertisement -

పెళ్లి సందడి చిత్రంతో రోషన్ మేకతో జంటగా నటించిన శ్రీలీల.. ఆ చిత్రంతో అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో డెబ్యూ మూవీతోనే అందరినీ ఆకట్టుకున్న శ్రీలీల.. ఆ తరువాత ధమాకా అంటూ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తన స్టెప్పులతో సింగిల్ స్క్రీన్లను ఊపేస్తూ శ్రీలీల మాస్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆఫర్లు పుష్కలంగానే వస్తున్నా.. విజయాలు మాత్రం అందని ద్రాక్షలానే మిగిలింది.

Also Read – బిగ్ బాస్ హౌస్ లో పాత కంటెస్టెంట్ రీ ఎంట్రీ.. నామినేట్ చేస్తూ ఒక్కొక్కరి మాస్క్ తీసేస్తూ

శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని చోట్లా నటించేస్తోంది. ఇక శ్రీలీల పెళ్లి గురించి బీ టౌన్ సర్కిళ్లలో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కార్తిక్ ఆర్యన్, శ్రీలీల కలిసి హిందీలో ఓ మూవీని చేస్తున్నారు. ఈ ప్రయాణంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారనే టాక్ అంతటా ప్రచారంలోకి వచ్చింది.

అలా రూమర్లు తెగ ప్రచారం అవుతున్న సమయంలోనే ఇలా ‘మాస్ జాతర’ ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీలీల తన పెళ్లికి సంబంధించిన అప్డేట్ ఇచ్చేసింది. తాను ప్రస్తుతం కంఫర్ట్ జోన్‌లో ఉన్నానని, తన ఇంట్లో బోల్డ్ టాపిక్స్ మాట్లాడుకోమని, ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూసినప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే పాత్రల్నే చేస్తానని చెప్పుకొచ్చారు.

తన పెళ్లి అయినా కూడా అలాంటి పాత్రలే చేస్తానని క్లారిటీ ఇచ్చింది. అయితే తన పెళ్లి మాత్రం ఇప్పట్లో జరగదు, ఇప్పట్లో చేసుకోను అని నవ్వుతూ అనేసింది. దీంతో శ్రీలీల పెళ్లి టాపిక్ మరోసారి నెట్టింట్లో వైరల్ కాసాగింది. మరి శ్రీలీల నిజంగానే ప్రేమలో ఉందా? కార్తిక్ ఆర్యన్‌తో వివాహాం రూమర్ నిజమేనా? అన్నది తెలియాలంటే మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.

Also Read – Rishab Shetty: ‘కాంతార చాప్టర్ 1’ నంబర్ వన్‌గా నిలవాలంటే.. రావాల్సిన కలెక్షన్ ఇదే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad