నటసింహం బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4(Unstoppable S4) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేశ్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హాజరై పలు విశేషాలను బాలయ్యతో పంచుకున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కొత్త ఎపిసోడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రచారంలో భాగంగా అన్ స్టాపబుల్ సెట్స్‌లో చెర్రీ సందడి చేశారు.
ఈ సెట్‌కు వచ్చిన చరణ్‌కు బాలయ్య వెల్కమ్ చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరం సంక్రాంతికి వస్తున్నాం అని తెలిపారు. డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ సినిమాలు సూపర్ హిట్ కావాలని.. ఇండస్ట్రీ మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని తెలిపారు. ఈ వీడియో పట్ల నందమూరి, మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ జనవరి 12న, చెర్రీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదల కానున్నాయి.