Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభUpendra: మరోసారి మ్యాడ్‌ ఎక్స్‌పీరియన్స్‌.. గ్రాండ్‌ రీరిలీజ్‌కు సిద్ధమైన కల్ట్‌ క్లాసిక్‌ మూవీ

Upendra: మరోసారి మ్యాడ్‌ ఎక్స్‌పీరియన్స్‌.. గ్రాండ్‌ రీరిలీజ్‌కు సిద్ధమైన కల్ట్‌ క్లాసిక్‌ మూవీ

Upendra Movie Re Release: 1980’s, 90’s జనరేషన్‌కు కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర అంటే గుర్తొచ్చేది ఆయన చేసిన వైవిధ్యభరితమైన సినిమాలు. ప్రస్తుత జనరేషన్ ఎలా ఉంటుందో అప్పట్లోనే ఊహించి సినిమాలుగా తీసి డిఫరెంట్‌ ట్రెండ్‌ సెట్‌ చేశారు. ఇక 1999లో ఉపేంద్ర నటించిన ‘ఉపేంద్ర’ సినిమా.. అప్పట్లో జనాలకి అర్ధం కాక విమర్శలు అందుకుంది. కానీ ఇప్పుడు మాత్రం సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూసి.. ‘ఉప్పి మావ అప్పుడే ఊహించి కల్ట్‌ మూవీ తీశాడు రా’ అని చెప్పుకొంటారు. అలాంటి కల్ట్ క్లాసిక్‌ మూవీ ఇప్పుడు రీ-రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.   

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/pradeep-ranganathan-dude-movie-telugu-trailer-talk/

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. కొత్తగా రిలీజ్ అయిన సమయంలో ఫ్లాప్‌ టాక్‌ అందుకున్న సినిమాలు సైతం టీవీల్లో హిట్ కావడంతో రీ- రిలీజ్‌ చేయాలంటూ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో ఆరెంజ్‌, ఓయ్‌, ఖలేజా లాంటి క్లాసిక్ సినిమాలు రీ-రిలీజ్‌తో మారుమోగిపోతున్నాయి. ఈ క్రమంలో 1999లో కన్నడ స్టార్ ఉపేంద్ర దర్శకత్వం వహించి నటించిన ‘ఉపేంద్ర’ సినిమా కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకోగా.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆ మ్యాడ్‌ ప్రపంచంలోకి దించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 11(శనివారం), 2025న థియేటర్లలో గ్రాండ్ రీ-రిలీజ్ కానుంది. 

తాజాగా రిలీజైన ‘ఉపేంద్ర’ ట్రైలర్ నెట్టింట్లో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తోంది. “Get ready for a mad experience!” అంటూ మేకర్స్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. విభిన్న కథా శైలితో రూపొందిన ‘ఉపేంద్ర’లో కొన్ని అభ్యంతరకర డైలాగులతో పాటు కథ వివాదాస్ప‌దమైంది. అయినప్పటికీ సినిమా తీసిన విధానానికి అభిమానులు ఆకర్షితులయ్యారు. కాగా, ఈ సినిమాలో రవీనా టాండన్, ప్రేమ, దామిని కీలక పాత్రలు పోషించారు. శిల్పా శ్రీనివాస్ నిర్మాణంలో గురుకిరణ మ్యూజిక్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పాటలు అప్పట్లో ఉర్రూతలూగించాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad