Rajamouli: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్, సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళిల కాంబో ‘వారణాసి’ ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రాజమౌళి మార్క్ గ్రాండీయర్, మహేష్‌బాబు పవర్ ప్యాక్డ్ లుక్ చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతుంటే, ఒకే ఒక్క సీన్ మాత్రం పెద్ద వివాదానికి, దారి తీయడం హాట్ టాపిక్‌గా మారింది.
‘వారణాసి’ టీజర్‌లో అందరూ మాట్లాడుకుంటున్న ఎలివేషన్ సీన్ ఒక్కటే! రౌద్రంగా, రక్తపు మరకలతో ఉన్న మహేష్ బాబు.. చేతిలో త్రిశూలం పట్టుకుని, నంది పై కూర్చుని ఎంట్రీ ఇవ్వడం.. చూసే ప్రతి ఒక్కరికీ పూనకాలు తెప్పించింది. ఈ లుక్, మహేష్‌బాబు పోషిస్తున్న ‘రుద్ర’ అనే పాత్రకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యిందంటూ ఫ్యాన్స్ డ్యాన్సులు చేస్తున్నారు. కానీ, ఈ ఎపిక్ ఎంట్రీనే ఇప్పుడు నెటిజన్ల కంటికి చిరాకు తెప్పిస్తోంది. ‘ఇది కాపీ’, రాజమౌళికి కొత్త ఐడియాలు రావా అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
మహేష్‌బాబు నందిపై కనిపించిన సీన్‌ను.. గతంలో వచ్చిన రెండు సినిమాలతో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు గోపీచంద్ ‘భీమా’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’. ఈ సినిమాల్లో కూడా హీరోలు నందిపై కనిపించే సన్నివేశాలు ఉన్నాయి. ఈ పోలికల వల్లే రాజమౌళిపై ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి, ‘వారణాసి’లో మహేష్ బాబుది ‘రుద్ర’ అనే శివ సంబంధిత పాత్ర కాబట్టి, శివుడి వాహనం అయిన నందిపై కనిపించడం అనేది పౌరాణికంగా కరెక్టే. మిగిలిన దర్శకులు కూడా అదే పౌరాణిక మూలాన్ని వాడుకున్నారు. అయితే, రాజమౌళి మాత్రం అదే ఐడియాను తీసుకుని, గ్లోబల్ స్కేల్‌లో అదిరిపోయే విజువల్స్, ఎలివేషన్స్‌తో చూపించారు. అందుకే ఈ సీన్ ఇంత వైరల్ అయ్యింది. కాపీ ఆరోపణలు ఉన్నా, లేకపోయినా.. ఈ రచ్చ మొత్తం సినిమాకు కావాల్సినంత భారీ పబ్లిసిటీని తెచ్చిపెట్టి, అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


