Lavanya tripathi blessed a baby:మెగాహీరో వరుణ్ తేజ్ తండ్రి అయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌లో లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అభిమానులు వరుణ్, లావణ్య త్రిపాఠి జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిరంజీవి సైతం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి ఈ జంటకి శుభాకాంక్షలు తెలిపారు.
తాము తల్లిదండ్రులం కానున్నట్లు వరుణ్ తేజ్ మేలో సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాను. కమింగ్ సూన్’.. అనే క్యాప్షన్‌తో శుభవార్తను పంచుకున్నారు. తాజాగా వీరికి బాబు పుట్టడంతో మెగా కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. సెలబ్రిటీలు సైతం ఈ జంటకు విషెస్ చెబుతున్నారు.
లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2017లో ‘మిస్టర్’ సినిమా కోసం వరుణ్ – లావణ్య తొలిసారి కలిసి నటించారు. అప్పుడే వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. 2023 నవంబర్ 1న ఇటలీ వేదికగా వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు.


