మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej)ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులు అందుకుని స్టార్ హీరో రేసులో వెనకబడిపోయాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’ మూవీ తర్వాత వరుణ్‌కు ఒక్క హిట్ కూడా లేదు. ఆయన నటించిన గత మూడు సినిమాలు ‘గాండీవధర అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. దీంతో తప్పనిసరిగా ఓ హిట్ అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో తన 15వ చిత్రాన్ని ప్రకటించాడు.
ఇవాళ తన పుట్టినరోజు కావడంతో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ విడుదలైంది. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ పోస్టర్‌లో ఓ చిన్న కుండపై డ్రాగన్ బొమ్మ.. చుట్టూ కొరియన్ భాషలో అక్షరాలు ఉన్నాయి. ఇండో కొరియన్ హారర్ కామెడీ కథ అని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతోనైనా వరుణ్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి రావాలని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.