బయోపిక్ లంటే కాసులు కురిపించే ఫార్ములాగా మారిన ఈ రోజుల్లో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కూడా తెరకెక్కేందుకు సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇది ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టే అయినా తాజాగా సుబ్బలక్ష్మి జయంతి సందర్భంగా విద్యాబాలన్ ఫోటోషూట్ చూస్తుంటే ఈ బయోపిక్ లో ఆమె నటించటం ఖాయమైనట్టు హింట్ ఇచ్చినట్టుంది. పైగా సుబ్బలక్ష్మికి తాను పెద్ద అభిమాని అని పలుసందర్భాల్లో విద్యా స్వయంగా ప్రకటించి ఇప్పుడు ఇలా ఫోటో షూట్లు చేసేప్పటికి మరో బయోపిక్ లో విద్యా మెరవనున్నట్టు స్పష్టమవుతోంది.
