NTR and Vijay Deverakonda: సంక్రాంతి తర్వాత స్టార్ హీరోలు నటించిన సినిమాలేవి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు. పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడి చాలా కాలమే అయ్యింది. అగ్ర కథానాయకుల సినిమాల రిలీజ్ కోసం అభిమానుల ఎదురుచూపులకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో తెరపడనుంది. జూలై 24 నుంచి వరుసగా మూడు వారాల వ్యవధిలో నాలుగు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. హరిహర వీరమల్లుతో పాటు కింగ్డమ్, వార్ 2, కూలీ రిలీజ్ కాబోతున్నాయి.
ప్రమోషన్స్‌లో పోటీ..
ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్‌ను మేకర్స్ మొదలుపెట్టారు. ప్రమోషన్స్‌లోనూ ఈ నాలుగు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజాగా ఎన్టీఆర్ వార్ 2 ట్రైలర్‌ను జూలై 25న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు మంగళవారం ప్రకటించారు. అదేరోజు విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్ కోసం విజయ్ దేవరకొండ వెనక్కి తగ్గినట్లు సమాచారం. కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేసినట్లు సమాచారం.
Also Read – Gaza Crisis: యుద్ధం ఆపాల్సిందేనని 28 దేశాల గళం… ఇజ్రాయెల్ ఏకాకి అవుతోందా?
ఇరవై ఐదేళ్లు…
ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఐకాన్స్‌గా కొనసాగుతోన్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ ఏడాదితో 25 ఏళ్లు అవుతోంది. వారి సినీ జర్నీకి గుర్తుగా జూలై 25న వార్ 2 ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ మంగళవారం ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు.
కింగ్డమ్ ట్రైలర్…
కాగా జూలై 25నే విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. సడెన్‌గా వార్ 2 ట్రైలర్ జూలై 25నే రానుండటంతో కింగ్డమ్ మేకర్స్ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. తమ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ఒక్క రోజు పోస్ట్ పోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జూలై 25న కాకుండా జూలై 26న కింగ్డమ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరో ఒకటి రెండు రోజుల్లో కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్నట్లు సమాచారం.
తెలుగులో రిలీజ్…
మరోవైపు కింగ్డమ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ వార్ 2 మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రెండు సొంత సినిమాలే కావడంతో ట్రైలర్స్ ఒకే రోజు రిలీజ్ చేస్తే గట్టిగానే డ్యామేజ్ జరిగే అవకాశం ఉండటంతో కింగ్గమ్ ట్రైలర్ రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేసినట్లు చెబుతున్నారు.
Also Read – TET 2025 Results: తెలంగాణ టెట్ 2025 ఫలితాలు విడుదల: ఉత్తీర్ణత శాతం 33.98%..!
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్…
కింగ్డమ్ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పై యాక్షన్ మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వార్ 2 మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వార్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా కనిపించబోతున్నది. వార్ 2 మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. వార్ 2లో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.


