Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ముచ్చటగా మూడోసారి కలిసి ఓ సినిమా చేస్తున్నారు. హ్యాట్రిక్ మూవీ షూటింగ్‌ను సైలెంట్‌గా మొదలుపెట్టేశారు. విజయ్, రష్మిక కాంబినేషన్‌లో తెలుగులో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చాయి. గీత గోవిందం బ్లాక్‌బస్టర్‌గా నిలవగా.. డియర్ కామ్రేడ్ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాల్లో వీరిద్దరి జోడీ, కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి.
ఆరేళ్ల తర్వాత…
ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ మళ్లీ కుదిరింది. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ యాక్షన్ మూవీని చాలా రోజుల క్రితమే అనౌన్స్‌చేశారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 14వ మూవీ ఇది.
Also Read- HBD Pawan Kalyan: పవర్ స్టార్ .. కింగ్ మేకర్.. పవన్ కళ్యాణ్
వీడీ14 మూవీ..
వీడీ14 మూవీలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించబోతున్నది. విజయ్, రష్మిక జోడీకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఈ కాంబోను ఫిక్స్ చేశారట. ఈ సినిమా షూటింగ్ నాలుగైదు నెలల క్రితమే మొదలుకావాల్సింది. కానీ రష్మిక డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆలస్యమైనట్లు సమాచారం.
గండికోటలో…
కాగా ఈ హిస్టారికల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి మొదలైంది. హైదరాబాద్ శివారులోని గండికోటలో వేసిన ఓ మాసివ్ సెట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలపై కీలక సన్నివేశాలను డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ చిత్రీకరిస్తున్నారట. సెప్టెంబర్ 10 వరకు ఈ షెడ్యూల్ సాగనున్నట్లు సమాచారం.
చారిత్రక సంఘటనలతో…
బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో వీడీ 14 మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన కొన్ని చారిత్రక సంఘటనల ఆధారంగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ కథను సిద్ధం చేశారట. ఇందులో విజయ్ దేవరకొండ రోల్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు సమాచారం.
రౌడీ జనార్ధన…
ట్యాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కలిసి చేస్తున్న సినిమా ఇది. రాహుల్ సాంకృత్యాన్ మూవీతో పాటు రౌడీ జనార్ధన సినిమాను అంగీకరించారు విజయ్. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది.


