Kongdom Latest Updates: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ డెంగ్యూతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. తీవ్ర నీరసంతో బాధపడుతున్న విజయ్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు డెంగ్యూ అని నిర్దారించిన డాక్లర్స్, ఆయన్ను కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. డిశ్చార్జ్ చేయాలా లేదా? మరికొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచాలా? అనేది విజయ్ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయిస్తామని డాక్టర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఆరోగ్యంపై ఇప్పటి వరకు ఆయన టీమ్ నుంచి గానీ, కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ మూవీ జూలై 31న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉన్న ఇలాంటి సమయంలో ఇలా జరగటం అనేది కాస్త ఇబ్బందికరమైన విషయమే. కింగ్డమ్ విషయానికి వస్తే సినిమా ప్రమోషన్స్‌లో ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంది. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సె కథానాయికగా నటించింది. లైగర్ డిజాస్టర్ తర్వాత రౌడీ స్టార్ రెండు చిత్రాల్లో నటించారు. అందులో ఖుషి మోస్తరు విజయాన్ని దక్కించుకుంటే, ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయ్యింది. దీంతో విజయ్ తన ఆశలన్నీ ఇప్పుడు కింగ్డమ్ మీదనే పెట్టుకున్నారు.
నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. అయితే మేకర్స్ ఔట్‌పుట్ విషయంలో శాటిస్పాక్షన్ కాకపోవటంతో రీషూట్స్ చేశారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాకు ఓటీటీ డీల్ కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైంది. సినీ సర్కిల్స్ సమాచారం మేరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ కింగ్డమ్ ఓటీటీ రైట్స్‌ను రూ.50 కోట్లకు కొనుగోలు చేసిందని, ఇది విజయ్ కెరీర్‌లో హయ్యస్ట్ అని అంటున్నారు. ఇక థియేట్రికల్ డీలింగ్‌ను పూర్తి చేసే పనిలో నిర్మాతలున్నారు. పాన్ ఇండియా రేంజులో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీలో మాత్రం థియేటర్లో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీకి తీసుకురానున్నారని ప్రచారం జరిగింది. అయితే నిర్మాత నాగవంశీ ఈ వార్తలను ఖండించారు. హిందీలో టైటిల్ కాంట్రవర్శీ జరుగుతోందని, వేరే టైటిల్ ఫిక్స్ చేసి అక్కడ కూడా కచ్చితంగా జులై 31నే రిలీజ్ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.


