Vijay Deverakonda Kingdom: విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి (Gautam Tinnanuri) కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. జూలై 31న (Kingdom Release date) మూవీ రిలీజ్ కానుంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. రౌడీ స్టార్ ఫ్యాన్స్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్‌కి కూడా ఈ మూవీ ఎంతో కీలకం. ఎందుకంటే ‘లైగర్’ తర్వాత ఈ యంగ్ హీరో చేసిన ఖుషి పర్వాలేదనిపించుకుంటే, ‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్‌గా మారింది. ఇప్పుడు ఆయన తన ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. సినిమా ఔట్ పుట్ విషయంలోనూ మేకర్స్ కాంప్రమైజ్ కాలేదు. రీ షూటింగ్స్ కూడా జరిగాయంటే టీమ్ ఎంత మేరకు జాగ్రత్తలు తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చూడని విజయ్ దేవరకొండను ఈ సినిమాలో గౌతమ్ చూపించబోతున్నారనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.
‘కింగ్‌డమ్’పై ఉన్న అంచనాలకు తగినట్టే రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ కూడా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్‌కు మరో అంశం ఊరటనిచ్చింది. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ డీల్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రూ.50 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే డిజిటల్ రైట్స్ పరంగా ఇదే ఎక్కువ మొత్తం. సినిమాకు పెట్టిన బడ్జెట్‌లో ఎక్కువ భాగం డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు తిరిగి వచ్చాయని అంటున్నారు. ఇక నిర్మాత సూర్యదేవర నాగవంశీ సినిమాను థియేట్రికల్ రైట్స్ పరంగానూ తనదైన బిజినెస్ మైండ్‌తో బాగానే సేల్ చేసుకోగలడని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
హీరో విజయ్ దేవరకొండకే (Vijay Deverakonda) కాదు.. ఇటు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి ‘కింగ్‌డమ్’ హిట్ ఎంతో అవసరం అనే చెప్పాలి. ‘జెర్సీ’ తర్వాత ఈయన ఫోకస్ అంతా ఈ సినిమా మీదనే పెట్టాడు. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సెకు (Bhagyashri Borse) సైతం మూవీ హిట్ కీలకంగా మారింది. ఎందుకంటే ఆమె నటించిన తొలి చిత్రం మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయ్యింది. తర్వాత ఆమె వరుస సినిమాలను ఓకే చేసినా అవన్నీ ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి. వీటిలో ముందుగా ‘కింగ్‌డమ్’ ఆడియెన్స్ ముందుకు వస్తుంది. ఈ మూవీ హిట్టయితే ఆమె జోరు మరింత పెరుగుతోందనటంలో సందేహం లేదు. కోలీవుడ్ స్టార్ మ్యూజిషియన్ అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.


