Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభKingdom Review: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?

Kingdom Review: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?

Kingdom Review: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కింగ్డ‌మ్ మూవీ గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టించిన ఈ యాక్ష‌న్ డ్రామా మూవీ ఎలా ఉందంటే?

- Advertisement -

రివ్యూ…
విజ‌య్ దేవ‌ర‌కొండ హిట్టు అందుకొని చాలా కాల‌మైంది. టాక్సీవాలా త‌ర్వాత విజ‌య్ చేసిన సినిమాలు వ‌రుస‌గా బాక్సాఫీస్‌ వ‌ద్ద బోల్తా కొడుతూ వ‌చ్చాయి. స్ట్రాంగ్‌ క‌మ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా కింగ్డ‌మ్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో కింగ్డ‌మ్ ఆస‌క్తిని రేకెత్తించింది. గురువారం (జూలై 31న‌) థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌క్సెస్ బాట ప‌ట్టాడా? డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి అత‌డికి హిట్టు ఇచ్చాడా? లేదా? అంటే?

Also Read- Nidhhi Agerwal: నిధి అగ‌ర్వాల్ జూలై సెంటిమెంట్ – అప్పుడు బ్లాక్‌బ‌స్ట‌ర్ – ఇప్పుడు డిజాస్ట‌ర్‌

రాక్ష‌స రాజ్యంలో అడుగుపెడితే…
సూరి (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) తెలంగాణ‌లోని ఆంకాపూర్ పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తుంటాడు. సూరికి శివ (స‌త్య‌దేవ్‌) అనే అన్న ఉంటాడు. చిన్న‌ప్పుడే తండ్రిని చంపి ఇంటి నుంచి పారిపోతాడు శివ‌. అన్న‌కోసం ప‌ద్దెనిమిదేళ్లుగా వెతుకుతున్న సూరికి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. శ్రీలంక‌లోని జాఫ్నాలో ఓ డేంజ‌ర‌స్ స్మ‌గ్లింగ్ ముఠాకు శివ నాయ‌కుడ‌ని తెలుస్తుంది. శివ కోసం శ్రీలంక వెళ‌తాడు సూరి. రాక్ష‌స‌రాజ్యంగా పిల‌వ‌బ‌డే ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన సూరికి అక్క‌డ ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? ఆ రాజ్యానికి ఎలా రాజుగా మారాడు? కానిస్టేబుల్ అయిన సూరి స్ఫైగా మారి ఓ అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్‌లో ఏ విధంగా భాగ‌మ‌య్యాడు? సూరి లైఫ్‌లోకి వ‌చ్చిన అను (భాగ్య‌శ్రీ బోర్సే) ఎవ‌రు? మురుగ‌న్ నుంచి శివ‌కు ఎలాంటి ముప్పు పొంచి ఉంది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

అన్న కోసం త‌మ్ముడి పోరాటం…
మ‌ళ్లీరావా, జెర్సీ లాంటి ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్ త‌ర్వాత గౌత‌మ్ తిన్న‌నూరి చేసిన సినిమా ఇది. త‌న‌కు ప‌ట్టున్న భావోద్వేగాల‌కు యాక్ష‌న్ అంశాల‌ను జోడించి కింగ్డ‌మ్ క‌థ‌ను రాసుకున్నారు. ఈ సినిమా మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ ఏమిట‌న్న‌ది ట్రైల‌ర్‌లోనే చెప్పేశాడు డైరెక్ట‌ర్‌. అన్నను కాపాడ‌టం కోసం ఓ త‌మ్ముడు సాగించే పోరాటం చుట్టూనే ఈ సినిమా సాగుతుంది. సింపుల్ పాయింట్‌ను త‌న మార్కు ఎమోష‌న్స్‌తో రెండు గంట‌ల న‌ల‌భై నిమిషాల పాటు ఎంగేజింగ్‌గా స్క్రీన్‌పై ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్‌.

Also Read- Chiranjeevi: చిరంజీవి సినిమాల‌కు ప‌నిచేయ‌ద్దు – మెగా డాట‌ర్ సుస్మిత కొణిదెల‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్ – కార‌ణం ఇదే!

పీరియాడిక‌ల్ జాన‌ర్‌…
కంప్లీట్ పీరియాడిక‌ల్ జాన‌ర్‌లో క‌థ‌ను న‌డిపించ‌డం, శ్రీలంక బ్యాక్‌డ్రాప్ ఎంచుకోవ‌డం సినిమాకు ప్ల‌స్స‌య్యింది. 110 ఏళ్ల క్రితం శ్రీకాకుళంలో క‌థ‌ను మొద‌లుపెట్టి శ్రీలంక వ‌ర‌కు ఎలా చేరుకుంది అన్న‌ది డీటైలింగ్‌గా న‌డిపించాడు.

సెకండాఫ్ ఫ్లాట్‌..
హీరో క్యారెక్ట‌ర్ ప‌రిచ‌య‌మ‌య్యే సీన్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఇంట్ర‌డ‌క్ష‌న్లు, ఎలివేష‌న్లు అంటూ టైమ్ వేస్ట్ చేయ‌కుండా నేరుగా క‌థ‌లోకి వెళ్లిన తీరు బాగుంది. హీరో శ్రీలంక వెళ్ల‌డం, స్పైగా మారే సీన్లు, హీరోయిన్‌గా అత‌డి ల‌వ్ ట్రాక్‌తో ఫ‌స్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. సూరి త‌న అన్న శివ‌ను క‌లుస్తాడా? లేదా? అనే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో క్రియేట్ చేశారు డైరెక్ట‌ర్‌. అదే ఫ్లోను సెకండాఫ్‌లో కంటిన్యూ చేయ‌డంలో గౌత‌మ్ తిన్న‌నూరి కాస్తంత త‌డ‌బ‌డిపోయాడు. ప్రేక్ష‌కుల ఊహ‌ల‌కు అందేలా ఫ్లాట్‌గా క‌థ మారిపోతుంది. శివ అస‌లు స్మ‌గ్ల‌ర్‌గా ఎందుకు మారాడు? త‌న జాతి కోసం మురుగ‌న్‌తో చేసే పోరాటాన్ని ఇంకాస్త ఎఫెక్ట్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేసుకుంటే బాగుండేది.

ఎమోష‌న‌ల్ బాండింగ్‌…
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌త్య‌దేవ్ లాంటి టాలెంటెడ్ యాక్ట‌ర్స్‌తో లోపాల‌ను బాగానే క‌వ‌ర్ చేశాడు డైరెక్ట‌ర్‌. అన్న‌ద‌మ్ముల ఎమోష‌న‌ల్ బాండింగ్ బాగా రాసుకున్నారు. ఆ సీన్స్ అన్ని వ‌ర్క‌వుట్ అయ్యాయి. చివ‌రి ఇర‌వై నిమిషాలు ఆడియెన్స్‌కు సినిమా హై ఫీల్ ఇస్తుంది. సెకండ్ పార్ట్ కోసం ఇచ్చిన లీడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

అనిరుధ్ బీజీఎమ్‌…
టెక్నిక‌ల్‌గా రీసెంట్ టైమ్‌లో వ‌చ్చిన బెస్ట్ మూవీ ఇది. అనిరుధ్ బీజీఎమ్‌, ర‌గిలే ర‌గిలే పాట క‌థ‌కు ఆడియెన్స్ క‌నెక్ట్ అయ్యేలా చేసింది. శ్రీలంక‌లోని నాచుర‌ల్ లోకేష‌న్స్‌, విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణంలో మేక‌ర్స్ ఎక్క‌డా రాజీప‌డ‌లేదు.

ఛ‌త్ర‌ప‌తి ఛాయ‌లు…
కింగ్డ‌మ్‌లో ఛ‌త్ర‌ప‌తి, స‌లార్‌, యుగానికి ఒక్క‌డు నుంచి ఇటీవ‌ల రిలీజైన రెట్రో ప‌లు సినిమాల ఛాయ‌లు క‌నిపిస్తాయి. కింగ్డ‌మ్‌లోని కొన్ని సీన్స్ ఇదివ‌ర‌కే ఆయా సినిమాల్లో చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది.

Also Read- HHVM: హరిహర వీరమల్లు రివ్యూ..

సూరి వ‌ర్సెస్ శివ‌…
కింగ్డ‌మ్‌లో సూరి పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ అద‌ర‌గొట్టాడు. గ‌త సినిమాల‌కు భిన్నంగా సెటిల్డ్ ప‌ర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. పాత్ర‌లో విజ‌య్ చూపించిన వేరియేష‌న్స్‌, లుక్ బాగున్నాయి. శివ పాత్ర‌కు స‌త్య‌దేవ్ న్యాయం చేశాడు. భాగ్య‌శ్రీ బోర్సే స్క్రీన్‌పై టైమ్ త‌క్కువే అయినా ఆమె క‌నిపించే సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అయ్య‌ప్ప పీ శ‌ర్మ‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, రోహిణి ఇలా చాలా మంది సీనియ‌ర్స్ ఈ మూవీలో క‌నిపించారు. వారి పాత్ర‌ల ప‌రిధి త‌క్కువే. వెంకటేష్ విల‌నిజం కొన్ని సీన్స్‌లో బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది.

ఫ్యాన్స్‌కు…
గ్యాంగ్‌స్ట‌ర్ మూవీస్‌ను ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌ను కింగ్డ‌మ్ మెప్పిస్తుంది. టెక్నిక‌ల్‌గా బ్రిలియంట్ ఫిల్మ్‌. విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన రీసెంట్ మూవీస్‌లో ఇదే బెస్ట్‌.

రేటింగ్: 2.5/5

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad