Sir Madam OTT: విజయ్ సేతుపతి, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన సార్ మేడమ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ రొమాంటిక్ యాక్షన్ కామెడీ మూవీ ఆగస్ట్ 22 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఒకే రోజు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
హరిహరవీరమల్లు కారణంగా…
తమిళంలో తలైవాన్ తలైవి పేరుతో రూపొందిన ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. జూలై నెలాఖరున కోలీవుడ్‌లో రిలీజైన ఈ మూవీ తెలుగులో మాత్రం హరిహరవీరమల్లు కారణంగా ఓ వారం ఆలస్యంగా ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించిన ఈ మూవీ తెలుగులో బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సార్ మేడమ్ మూవీ 90 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
Also Read – Netaji AI Movie : నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జీవిత చరిత్రపై AI మూవీ.. ట్రైలర్ రిలీజ్
51వ సినిమా…
సార్ మేడమ్ కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ అయినా విజయ్ సేతుపతి, నిత్యామీనన్ తమ నటనతో ఈ రొమాంటిక్ మూవీని నిలబెట్టారు. వారిద్దరి యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 51వ సినిమా ఇది. ఇందులో యోగిబాబు ఓ కీలక పాత్రలో కనిపించాడు. సార్ మేడమ్ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.
సార్ మేడమ్ కథ ఇదే…
ఆకాశవీరయ్య (విజయ్ సేతుపతి), రాణి (నిత్యామీనన్) పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకుంటారు. మనస్పర్థల కారణంగా వారి వైవాహిక జీవితంలో గొడవలు మొదలవుతాయి. విడాకులు తీసుకోవాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? తమ గొడవలను పక్కనపెట్టి వీరయ్య, రాణి తిరిగి ఎలా ఒక్కటయ్యారు అన్నదే ఈ మూవీ కథ.
Also Read – Venkatesh Trivikram: సైలెంట్‌గా వెంకీ, త్రివిక్రమ్ మూవీ లాంఛ్ – రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే?
పూరి జగన్నాథ్‌తో తెలుగు సినిమా…
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు విజయ్ సేతుపతి. ఈ సినిమాలో టబు, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు గత కొన్నాళ్లుగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటోంది నిత్యామీనన్. సార్ మేడమ్ తర్వాత ఇడ్లీ కడై సినిమాలో ధనుష్‌కు జోడీగా కనిపించబోతున్నది.


