Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభVijay devarakonda: నేను సింగిల్ కాదు: విజయ్ దేవరకొండ.. నెట్టింట్లో మళ్లీ చర్చ!

Vijay devarakonda: నేను సింగిల్ కాదు: విజయ్ దేవరకొండ.. నెట్టింట్లో మళ్లీ చర్చ!

Rowdy boy vijay devarakonda: యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ విడుదలకు సిద్ధమవుతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

- Advertisement -

జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’లో విజయ్ శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి స్పందనను అందుకుంది.

‘కింగ్‌డమ్’లో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా విజయ్ కెరీర్‌లో మరో విజయంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘కింగ్‌డమ్’ తర్వాత విజయ్, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడికల్ చిత్రానికి పచ్చజెండా ఊపారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్న నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంచనాల మధ్యే, విజయ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

వ్యక్తిగత జీవితంపై విజయ్ స్పష్టత:

తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత సంబంధాలపై స్పందించారు. “నాకు 35 ఏళ్ళు.. ఖచ్చితంగా సింగిల్ కాదు” అని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రష్మిక మందన్నతో ఆయనకు ఉన్న సంబంధంపై చాలా కాలంగా వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. అయితే, విజయ్ రష్మిక పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకుండా, వ్యక్తిగత విషయాల్లో గోప్యతకు తాను ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

విజయ్ మాట్లాడుతూ, “ఒక నటుడిగా గుర్తింపు పొందాలని కోరిక ఉంటుంది. కానీ అదే సమయంలో ప్రైవసీని కాపాడుకోవాలని కూడా అనిపిస్తుంది. ఇదొక మానసిక సంఘర్షణ” అని వివరించారు.

మళ్లీ తెరపైకి రష్మిక-విజయ్ చర్చ

విజయ్ వ్యాఖ్యలతో నెట్టింట్లో ఆయన రిలేషన్ స్టేటస్ గురించి మళ్లీ చర్చ మొదలైంది. గతంలో విజయ్, రష్మిక కలిసి ఎయిర్‌పోర్టుల్లో, విహారయాత్రలలో కనిపించిన ఫోటోలు ఇప్పుడు నిజమయ్యాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో వారిద్దరూ కలిసి కనిపించడం, ఒకే కారులో ప్రయాణించడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. గతంలో రష్మిక కూడా విజయ్‌పై సానుకూల వ్యాఖ్యలు చేయడంతో, ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు.

అయితే, ఇప్పటివరకు విజయ్ లేదా రష్మిక ఈ సంబంధంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మొత్తానికి, ‘కింగ్‌డమ్’ చిత్రంతో పాటు విజయ్, రష్మిక మధ్య సంబంధం కూడా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబినేషన్ నిజమైతే, రాహుల్ సాంకృత్యాన్ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మరింత హైప్ లభించే అవకాశం ఉంది. విజయ్ తన వ్యక్తిగత జీవితంపై పూర్తి స్పష్టత ఎప్పుడు ఇస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad