Viswant Duddumpudi Wedding: టాలీవుడ్ యువ నటుడు విశ్వంత్ దుద్దుంపూడి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. భావన అనే యువతితో ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ శుభవార్తను విశ్వంత్ సోషల్ మీడియాలో ఫొటోలతో సహా పంచుకున్నారు. “ఎ ప్రామిస్ ఆఫ్ లైఫ్‌టైమ్” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ క్యూట్ కపుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ALSO READ: Srisailam : శ్రీశైలం సమీపంలో చిరుత దాడి.. చిన్నారిని ఈడ్చుకెళ్లిన వైనం
గత ఏడాది ఆగస్టులో విశ్వంత్, భావన నిశ్చితార్థం జరుపుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో సింపుల్‌గా జరిగిన ఈ వివాహం హడావుడి లేకుండా మూడు ముళ్ల బంధంతో పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోటకు చెందిన విశ్వంత్, కోయంబత్తూరులో ఇంజినీరింగ్ చదివారు. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన సమయంలో ‘కేరింత’ సినిమా ఆఫర్ రావడంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
‘కేరింత’ సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వంత్, ‘ఓ పిట్ట కథ’, ‘జెర్సీ’, ‘హైడ్ అండ్ సీక్’, ‘తోలు బొమ్మలాట’, ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’, ‘గేమ్ ఛేంజర్’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన నటనతో మంచి గుర్తింపు సాధించారు.
పెళ్లి ఫొటోలను మరోసారి ఆగస్టు 15, 2025న షేర్ చేసిన విశ్వంత్, తన భార్యతో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ జంట చిరస్థాయిగా సంతోషంగా ఉండాలని, విశ్వంత్ సినీ కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.


