Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభVT13: యాక్షన్ థ్రిల్లర్ ప్యాన్ ఇండియాలో మానుషీ చిల్లర్ తో వరుణ్ తేజ్ రొమాన్స్

VT13: యాక్షన్ థ్రిల్లర్ ప్యాన్ ఇండియాలో మానుషీ చిల్లర్ తో వరుణ్ తేజ్ రొమాన్స్

భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఫిలింగా సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో వరుణ్ తేజ్ సరికొత్తగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన మానుషీ చిల్లర్ తో జతకట్టనున్నారు. ఏరియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాలో రియల్ స్టోరీస్ నే నేపథ్యంగా తీసుకున్నట్టు సోనీ కంపెనీ వివరించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా వరుణ్ ఇందులో కనిపించనున్నారు. VT13లో తాను భాగమైనట్టు మానుషి స్వయంగా ట్వీట్ చేశారుకూడా. మిస్ వల్డ్ అయిన మానుషి సామ్రాట్ పృథ్వీరాజ్ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసినా ఆమెకు హిట్ దక్కలేదు.

- Advertisement -

ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్, విలన్స్ అంతా సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టి హిట్ కొట్టే పనుల్లో ఉండగా వారిలో మానుషి అందరికంటే ముందే ఉండి తన దూకుడు చూపుతున్నారు. టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న మానుషి ఇక్కడైనా హిట్ కొడుతుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News