Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభBigg Boss: హోస్ట్ మారనున్నాడా?.. యంగ్ హీరో కోసం నిర్వాహకుల వేట?

Bigg Boss: హోస్ట్ మారనున్నాడా?.. యంగ్ హీరో కోసం నిర్వాహకుల వేట?

- Advertisement -

Big Boss: వివాదాలు ఎన్ని ఉన్నా బిగ్ బాస్ అనేది సక్సెస్ ఫుల్ రియాలిటీ షో అనే సంగతి తెలిసిందే. ఒక సీజన్ లో కాస్త టీఆర్పీలు తగ్గినా మరో సీజన్ లో పుంజుకొని నిర్విరామంగా సాగుతూనే ఉంటుంది ఈ షో. ఇదే కాన్సెప్ట్ లతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో షోలు ఉండగా ఇండియాలో చాలా బాషలలో ఇదో హిట్ కాన్సెప్ట్ షో. మన తెలుగు విషయానికి వస్తే.. ఫస్ట్ షో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ కి తోడు స్టార్ కంటెస్టెంట్లతో సూపర్ డూపర్ హిట్ షో అనిపించుకుంది.

ఆ తర్వాత సెకండ్ సీజన్ లో నానీ పర్వాలేదనిపించగా.. మూడవ సీజన్ నుండి ఇప్పుడు జరుగుతున్న ఆరవ సీజన్ వరకు కింగ్ నాగార్జున ఏకఛత్రాధిపత్యంగా ఈ షో నడిపిస్తున్నాడు. అయితే, రాను రాను ఈ షో టీఆర్పీలలో దారుణంగా పడిపోతుంది. ఒకే ఫార్మేట్ లో నడిచే షో.. ముందే కంటెస్టెంట్ల ఎలిమినేషన్ స్క్రిప్ట్ అనే ఆరోపణలు, ప్రేక్షకులకు పెద్దగా పరిచయంలేని కంటెస్టెంట్లకు తోడు.. శని, ఆదివారాలలో పెరగాల్సిన ఎంటర్ టైన్మెంట్ ఢీలా పడడంతో షో పరిస్థితి దారుణంగా తయారైంది.

అందుకే ఈసారి హోస్ట్ మార్చాలని ఫిక్సయిన షో నిర్వాహకులు కొత్త హోస్ట్ అదీ యంగ్ హీరో కోసం వేటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే సీజన్ నుండి స్టార్ట్ కంటెస్టెంట్లతో పాటు స్టార్ హీరోను హోస్ట్ చేసి మళ్ళీ షోకు పునర్వైభవం తీసురావాలని చూస్తున్న షో నిర్వాహకులు ఇప్పటి నుండే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టారట. మళ్ళీ తారక్ తో పాటు విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, రామ్ పేర్లు హోస్ట్ లిస్టులో వినిపిస్తుండగా.. ఈసారి కొత్త హోస్ట్ ఎవరవుతారన్నది ఆసక్తిగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News