Wednesday, November 13, 2024
Homeనేరాలు-ఘోరాలుRoad Accident | వివాహ వేడుకలో తీవ్ర విషాదం

Road Accident | వివాహ వేడుకలో తీవ్ర విషాదం

వివాహ వేడుక ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తెలంగాణలోని జనగాం జిల్లాలో వివాహ రిసెప్షన్ కి వెళ్లి తిరిగి వస్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి (Road Accident) గురైంది. మరో 5 నిమిషాల్లో తమ ఇంటికి చేరుకుంటాం అనుకుంటుండగా అనుకోని ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

- Advertisement -

వివరాల్లోకి వెళితే… జగిత్యాల హనుమాన్ వాడకి చెందిన ఓ కుటుంబం ఓ వివాహ రిసెప్షన్ కి హాజరై తిరిగి కారులో ఇంటికి బయలుదేరారు. జగిత్యాల – కరీంనగర్ ప్రధాన రహదారిపై ధరూర్ గ్రామ కెనాల్ వద్దకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయింది. తెల్లవారు జామున 4:30 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సును అతి వేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగినట్లు సమాచారం. కారులో ముందు సీట్లో ఉన్న యువకుడు, యువతి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో ఉన్న రాయమల్లు, ఆయన భార్యకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News