7-Year-Old Girl Raped In School In Jaipur: రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంత హేయమైన ఘటన జరిగింది. పాఠశాలకు వెళ్లిన ఏడేళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణం శనివారం జైపూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు పాఠశాలలోకి చొరబడి టాయిలెట్‌లో దాక్కున్నాడు. బాలిక టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో ఆమెను పట్టుకుని అత్యాచారం చేశాడు. ఈ ఘటన జరిగిన వెంటనే బాలిక విషయాన్ని తన ఉపాధ్యాయురాలికి చెప్పడంతో, వారు తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల గోడ దూకి పారిపోతున్నట్లు స్థానికులు చూసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ, నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. విచారణలో, 35 ఏళ్ల నిందితుడు తాను నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని ఆదివారం అరెస్టు చేశారు.


