Sunday, June 22, 2025
Homeనేరాలు-ఘోరాలుCriminal disguised as a woman: మహిళా వేషంలో ఉన్న క్రిమినల్ అరెస్ట్..!

Criminal disguised as a woman: మహిళా వేషంలో ఉన్న క్రిమినల్ అరెస్ట్..!

Criminal in lady getup: ఇటీవల ఓ ఆశ్చర్యకరమైన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నేరం చేసిన ఓ వ్యక్తి, పోలీసుల కంట్లో పడి జైలు పాలవుతానన్న భయంతో… అసలైన గుర్తింపును దాచి, మహిళా వేషంలో తప్పించుకొని తిరుగుతూ అనుకోకుండా అడ్డంగా పట్టుబడ్డాడు.రాజస్థాన్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తి, తనపై ఉన్న నేరాల కేసుల్లో నుంచి తప్పించుకోవడానికి మహిళా వేషంలో తిరుగుతూ చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

అసలు ఎవరీ శంకర్..?

రాజస్థాన్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినలే ఈ దయా శంకర్. ఇతగాడి మీద ఇప్పటివరకు మొత్తం 13 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. రకరకాల దొంగతనాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు ఇలా అన్ని రకాలుగా నేరాలకు పాల్పడి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో భాగమై ఉన్నాడు.

ఈ ఏడాది పోయిన ఫిబ్రవరిలో ఈ దయా శంకర్ అనే అతడు.. ఓ ఇరవై మూడేళ్ల ప్రిన్స్ చావ్లా అనే కుర్రాడిపై తన బృందంతో దాడికి దిగాడు. వారంతా కర్రలు, సీసాలతో ఆ యువకుడిని చితక బాదారు. అదికాక కేసు పెడితే అతడిని చంపేస్తామని బెదిరించారు. సదరు బాధితుడు గాయాల నుంచి కోలుకున్నాక స్టేషన్‌కు వెళ్ళి వారిపై ఫిర్యాదు చేసి కేసు పెట్టాడు.ఈ కేసుకు సంబంధించి గత కొద్ది రోజులుగా పోలీసులు అతడ్ని పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇతనేమో చీరలో వయ్యారాలు పోతూ ఇక తననెవరూ గుర్తు పట్టలేరని అనుకున్నాడు. కానీ… అతడి శరీర భాష, నడకపై వారికి అనుమానం వచ్చి తీగ లాగితే అసలు కథ బయటపడింది. పోలీసులు చివరకు అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు.

శంకర్‌ పై ఇదే కాక పలు మోసాల కేసులు ఉన్నాయి. పోలీసులు అన్వేషణ జరుపుతుండగా అతను పరారయ్యాడు. అరెస్ట్‌కు కాకుండా ఉండేందుకు మహిళా వేషం వేసుకోవడం అతడు ఎంచుకున్న వ్యూహం అన్నట్టు. ఇందుకోసం చీర, బ్లౌజు, విగ్, అమ్మాయిల మాట్లాడే శైలి.. ఇలా పూర్తిగా మహిళలా ప్రవర్తిస్తూ, బస్సులు, స్టేషన్లలో తిరుగుతూ పోలీసుల కంట పడకుండా తప్పించుకుంటూ వచ్చాడు.

ఈ ఘటన మానవ మస్తిష్కం ఎంతలా వ్యూహాత్మకంగా ఆలోచించగలదనే విషయాన్ని గుర్తుచేస్తోంది. నేరం చేసి తప్పించుకోవడంలోనూ ఇంత తెలివిని ఉపయోగించడం చూస్తే, మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం స్పష్టమవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News