నేను సరెండర్ కావట్లేదంటూ తేల్చి చెప్పాడు ఖలిస్థాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్. 30 ఏళ్ల అమృత్ పాల్ సిక్కులను రెచ్చగొట్టి ఖలిస్థాన్ ప్రత్యేక సిక్కు దేశం ఏర్పాటు చేసే ఉద్యమాన్ని రేకెత్తటంతో పలు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమృత్ పాల్ ను అరెస్టు తప్పించుకుంటూ 13 రోజులుగా పరారీలో ఉన్నాడు. కాగా అతను లొంగిపోయేందుకు రెడీగా ఉన్నట్టు వచ్చిన వార్తలను అతను యూ ట్యూబ్ ఛానెల్ లో స్పందిస్తూ తాను లొంగిపోయే సవాలే లేదని తేల్చి చెప్పాడు. కాగా పదేపదే గెటప్స్ మారుస్తూ, వెహికల్స్ మారుస్తూ అమృత్ పాల్ పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్నాడు.
Amritpal: నేనెందుకు సరెండర్ అవుతా, ఛాన్సే లేదు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES