Saturday, July 6, 2024
Homeనేరాలు-ఘోరాలుAnantapur: కామాంధుడైన తండ్రికి జీవిత కాల శిక్ష

Anantapur: కామాంధుడైన తండ్రికి జీవిత కాల శిక్ష

జడ్జి సంచలన తీర్పు

కంటికి రెప్పలా కాపాడే వాడే, కామాంధుడై కాటువేసిన తండ్రి కేసు రుజువు కావడంతో కసాయి తండ్రికి జీవిత కాలం జైలు శిక్షతో పాటు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ POCSO కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి సంచలన తీర్పు చెప్పారు.

- Advertisement -

కేసు పూర్వాపరాలు…..

కదిరి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతి చదివే విద్యార్థిని పట్ల తన తండ్రి తలపుల బాబ్జాన్ మూడు నెలలుగా మద్యం తాగి తన తల్లి ఇంట్లో లేని సమయంలో సదరు బాలికపై లైంగికంగా వేధిస్తూ అత్యాచారానికి పాల్పడ్డేవాడు. ఎవరికైనా చెపితే చంపుతానని బెదిరించేవాడు. చివరికి ఆరోగ్యం క్షీణించి పాఠశాలకు వెళ్ళిన సమయంలో బాధిత బాలికకు వాంతులు, కళ్లు తిరగడంతో గమనించిన డ్రిల్ టీచర్, ఇతర టీచర్ల సహాయంతో పరీక్షించగా సదరు మైనరు బాలిక గర్భవతి అని నిర్ధారించారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన తండ్రి తలపుల బాబ్జాన్ పై 26-11-2018 తేదీన కదిరి పట్టణ పోలీసు స్టేషన్ లో బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పొలీసులు సెక్షన్ 376 (f), 342, 506 IPC and sec. 5 (J) (ii) (n) & 6 of POCSO act మేరకు కేసు నమోదు చేసి, అప్పటి డి యస్ పి శ్రీలక్ష్మి కేసు దర్యాప్తు చేసి, అనంతరం నిందితుడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో భాగంగా ప్రత్యేక ప్రాసిక్యూటర్ కసనూరు విద్యాపతి బాధితురాలి పక్షాన 13 మంది సాక్షులను విచారించారు. కేసు పూర్వాపరాలు, ఇరు వర్గాల వాదనలు అనంతరం ముద్దాయి చేసిన పని సభ్య సమాజం తల దించుకొనేలా వుందని ముద్దాయికి జీవిత కాలం జైలు శిక్ష మరియు సెక్షన్ 506 IPC క్రింద 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 5 వేలు జరిమానా ఆదేశిస్తూ బాధితురాలికి రూ. 4 లక్షలు పరిహారానికి ప్రభుత్వంకు సిఫార్సు చేస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News