హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని పరకాల ఎక్స్ రోడ్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తున్న రూ,1,02,500లను గుర్తించి సీజ్ చేసినట్టు ఏసిపి జీవన్ రెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీపీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ రమేష్, ఎస్ ఎస్ టి టీం సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో హనుమకొండ కు చెందిన నితీష్ వద్ద రూ,1,02,500లను గుర్తించినట్టు చెప్పారు. అట్టి డబ్బుల గురించి అధికారులు ప్రశ్నించగా అట్టి డబ్బులకు సరి అయిన ధ్రువపత్రాలు చూపించకపోవడంతో ఎలక్షన్ అధికారులు సదరు డబ్బులను సీజ్ చేసి ఎలక్షన్ గ్రీవెన్స్ కమిటీ కరీంనగర్ కు అప్పగించినట్లు చెప్పారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా సరి అయిన ధ్రువపత్రాలు లేకుండా రూ,50 వేల పైబడి ఉండి ప్రయాణిస్తే వాటిని ఎలక్షన్ అధికారులు సీజ్ చేశామన్నారు.
Huzurabad: హుజురాబాద్ లక్ష రూపాయలు సీజ్
ఎలక్షన్ గ్రీవెన్స్ కమిటీ కరీంనగర్ కు అప్పగింత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES