ఇక్కడ జరిగిన ఓ దోపిడీ చర్చనీయాంశం అయ్యింది. ఆత్మకూరు పట్టణంలోని ప్రధాన వ్యాపార కుడల్లల్లో ఐదు షాపుల్లో ఏకకాలంలో దొంగతనం జరిగింది. ఈ ఐదు షాపుల్లో నగదు, విలువైన వస్తువులు ఉన్నా దొంగలు వాటి జోలికి పోకుండా కేవలం సిగరెట్లను మాత్రమే దోచుకు వెళ్లారు. సిగరెట్లపై దొంగలకు ఉన్న వ్యామోహమో లేక పగో అర్థం కావడం లేదని ఇదో వింత దొంగతనం అని షాపు యజమానులు పేర్కొంటున్నారు. ఐదు షాపుల్లో సుమారు రూ.30వేలు విలువగల సిగరెట్లను దోచుకెళ్లారు, ఇందులోనూ అధికంగా బ్రిస్టల్, చిన్న గోల్డ్ సిగరెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతో కష్టపడి బలమైన షెట్టర్ ల తాళాలను పగుల గొట్టిన దొంగలు ఎందుకు కేవలం సిగరెట్ల దోపిడీకి పాల్పడ్డారో తెలియడం లేదని యజమానులు వాపోతున్నారు. నిందితులు బయట ఎక్కడ సి.సి కెమెరా రికార్డ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. షార్ట్ సర్క్యూట్ అవుతుందోనని భయమో లేక కరెంట్ బిల్లులకు భయపడో షాపు యజమానులు సైతం షాపుల్లో ఉన్న సి.సి కెమెరాలను రాత్రి వేళల్లో ఆఫ్ చేసి ఉండడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వరుస దొంగతనాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్మకూరు పోలీసులు తెలిపారు.
Athmakuru: సిగరెట్ల దొంగ !
డబ్బులు, విలువైన వస్తువులున్నా వదిలి వేసిన దొంగ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES