ఎట్టకేలకు బండి సంజయ్ కు బెయిల్ లభించింది. టెన్త్ క్లాస్ హిందీ కొషన్ పేపర్ లీకేజ్ లో ఏ1గా ఉన్న సంజయ్ కు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈరోజు మధ్యహ్నం బండి జైలు నుంచి బయటికి రానున్నారు. బుధువారం అర్ధరాత్రి అరెస్ట్ అయిన బండికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈనేపథ్యంలో ఆయన బెయిలుకు అప్లై చేసుకోగా 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఆతరువాత రాత్రి 10 గంటలకు ఆయనకు బెయిల్ ఇస్తున్నట్టు కోర్టు తెలిపింది. బండి సంజయ్ తో పాటు, బీజేపీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఈనెల 10న బండి సంజయ్ కేసు విచారణకు రానుంది. ఇప్పటికే సంజయ్ అరెస్టుపై ప్రభుత్వానికి, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. మొత్తానికి బండి సంజయ్ కేసులో అడుగడుగునా ఎనలేని ఉత్కంఠ, ట్విస్టులున్నట్టు మరోమారు స్పష్టమవుతోంది.
Bandi Sanjay Bail: కాసేపట్లో బెయిల్ పై విడుదల కానున్న బండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES