నేరాన్ని ఒప్పుకున్న బండి సంజయ్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఆసక్తిగా ఉన్నాయి. కమలాపూర్ గవర్నమెంట్ స్కూల్ నుంచే కొషన్ పేపర్ లీక్ అయిందని సీపీ రంగనాథ్ వెల్లడించారు. బండి రిమాండ్ రిపోర్టును పోలీసులు కోర్టులో సమర్పించారు. ఏ 1 గా బండి ఏ 2 గా భూర ప్రశాంత్ తదితరులు ఉండటం విశేషం. ఇక టెన్త్ పేపర్ లీకేజ్ విషయానికి వస్తే ఏ 2 అయిన ప్రశాంత్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పేపర్ పంపగా, బండి సంజయ్ కి ఆతరువాత చేరింది. అయితే పేపర్ ఆలస్యంగా పంపినాకూడా 9.30కే పేపర్ లీక్ అయిపోయిందంటూ ప్రశాంత్ తప్పుడు వార్తలు ప్రచారం చేసినట్టు తేలింది. కేసీఆర్ సర్కారుకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఈ ప్రయత్నమంతా సాగినట్టు పోలీసుల దర్యాప్తు తేల్చింది. ఈ కేసులో ఇంకా ఆరుగురు పరారీలో ఉండగా మిగతావారిని పోలీసులు విచారిస్తున్నారు. బండి తన ఫోన్ ఇవ్వట్లేదని ఇస్తే ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తుందని సీపీ వెల్లడించారు.
Bandi Sanjay: బండి రిమాండ్ రిపోర్ట్ లో సెన్సేషనల్..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES