Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుBetting racket: 'ఐపీఎల్' బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు

Betting racket: ‘ఐపీఎల్’ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు

దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఐపీఎల్ – 2023 క్రికెట్ పై గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్  ఎస్ఓటి పోలీసులు, మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి మొయినాబాద్  మండలంలోని సురంగల్ గ్రామ పరిధిలో గల ఏఎస్ ఫామ్ హౌస్ లో  ఐపీ ఎల్ క్రికెట్ పై నిర్వాహకులు బెట్టింగ్ సాగిస్తున్నారన్న సమాచారం అందడంతో  పోలీసులు మెరుపు దాడి చేసి ఛేదించారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది.

- Advertisement -

పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సురంగల్ గ్రామంలోని ఏఎస్ ఫామ్ హౌస్ పై ఐపీఎల్ ఆన్లైన్ టికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నా రన్న విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని ఎస్ఓటి పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా సోమవారం రాత్రి దాడులు నిర్వహించి ఐపీఎల్ మ్యాచ్ లో ఆన్ లైన్ టికెట్ బెట్టింగ్ సాగిస్తున్న ముగ్గురు బుకీ లను పట్టుకున్నారు. రెండు స్కోర్ పేపర్లు, సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్-7,  ఆరు స్మార్ట్ ఫోన్లు,  రూ. 40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.  బ్యాంకు ఖాతాలో అందుబాటులో ఉన్న రూ.12 లక్షల10 వేలతో కలుపి మొత్తం విలువ సుమారు రూ.53 లక్షలుగా ఉంటుందని తెలిపారు.  ఈ కేసులో 9 మంది నిందితులకు గాను ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు, మిగతా వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గేమింగ్ యాక్ట్ కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్ స్పెక్టర్ లక్ష్మీరెడ్డి తెలిపారు. ఏ1 నిందితుడుగా ఉన్న శంకర్( కూకట్పల్లి) పరారీలో ఉండగా, ఎ-2 తిరుపతయ్య (కూకట్పల్లి), ఏ -3 నిందితుడు పెద్ధి గారి నాగరాజు,  ఏ-4 నిందితుడు పాగలా మల్లారెడ్డి ( తొగుట గ్రామం సిద్దిపేట జిల్లా)లను అదుపులోకి తీసుకున్నామని ఇన్ స్పెక్టర్ ప్రణయ్ తేజ్ రెడ్డి తెలిపారు. భాస్కర్, సిద్దు(పంటర్ )మల్లి (పంటర్ )సాయి రెడ్డి( పంటర్) భాష( పంటర్ ) లు పరారీలో ఉన్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News