నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో(Bird Flue) రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. బర్డ్‌ఫ్లూతోనే మృతిచెందినట్టు ICMR నిర్ధారించినట్లు తెలిసింది. పచ్చి కోడిమాంసం తినడంతో పాటు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే కారణమని నిర్ధారణ అయింది.
మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌లో చేరిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి16న చిన్నారి మృతి చెందింది. చిన్నారి మరణంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతిచెందిన చిన్నారి ఇంటి సమీపంలో ఆరోగ్యశాఖ సర్వే నిర్వహించింది.
అయితే అక్కడ ఈ వ్యాధికి సంబంధించిన అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని సంబంధించిన జిల్లా అధికారులు స్పష్టం చేశారు. పల్నాడులో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి లేదని అధికారులు తెలిపారు. చికెన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉన్నాయి.
ప్రస్తుతం వైరస్ ఉన్న నేపథ్యంలో ఉడికించిన మాంసం తప్ప సాధారణ మాంసం ఎట్టి పరిస్థితిలో తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మొట్ట మొదటిసారిగా బర్డ్ ఫ్లూ మరణం ఏపీలో సంభవించడంతో ప్రజలుఆందోళన చెందుతున్నారు.