తమిళనాడులోని తిరుత్తని దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. బస్సు-లారీ ఢీకొనడంతో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవాళ్లను ఆస్పత్రికి తరలించారు.
తిరువళ్లూరు జిల్లాలోని తిరుత్తణి సమీపంలోని కోలింగర్ రాష్ట్ర రహదారిపై బస్సు, టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు మంది మరణించినట్లు సమాచారం. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే తిరుత్తణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విడుదలై సంచలనం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజీలో, ఎదురుగా వస్తున్న లారీ పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తున్న బస్సును ఢీకొట్టింది. బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయకచర్యలు చేపట్టారు.