Tuesday, June 24, 2025
Homeనేరాలు-ఘోరాలుStrange case: పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..!

Strange case: పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..!

- Advertisement -

Case on heritage products: ఒక్కోసారి వింతైన విషయాలు జరిగినప్పుడు షాక్ అయి చూస్తాం. కాసేపు నవ్వుకుంటాం కూడా. అయితే అది మనకు ఎంత వింతైనా… ఆ అనుభవించిన వాళ్లకు మాత్రం బాధే కదా అని తెలుసుకున్నప్పుడు మనం కూడా వారితో కలిసి బాధా పడతాం. ఇక్కడ ఇప్పుడు మీకు చెప్పబోయేది కూడా అచ్చం అలాంటి ఘటన గురించే. ఇక విషయాల్లోకి వెళితే కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఓ వింతైన కేసు నమోదు అయింది. పాలు విరిగిపోయాయని పోలీసులను ఆశ్రయించాడు ఓ బాధితుడు. సాధారణంగా పోలీసులు పరిష్కరించే కేసులకు భిన్నంగా ఇది ఒక ప్రత్యేకమైన సంఘటనగా మారింది. అధికారులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తును ప్రారంభించారు.

ఇది జరిగింది:

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ సూపర్ మార్కెట్‌లో ఒక వినియోగదారుడు 2 హెరిటేజ్ పాల ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. ఒక ప్యాకెట్‌ను ఎటువంటి సమస్య లేకుండా ఉపయోగించగా, మరుసటి రోజు ఉదయం మరిగించిన రెండవ ప్యాకెట్ లోని పాలు విరిగిపోయినట్లు చూసాడు.
పాడైపోయిన పాల గురించి దుకాణదారుడిని నిలదీయగా, తమకు ఎటువంటి బాధ్యత లేదని దుకాణదారుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దుకాణం నుండి ఎటువంటి పరిష్కారం లభించకపోవడంతో సదరు బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుని.. జరిగిన ఘటన పై ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు.. ఫుడ్ క్వాలిటీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగే కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

నెటిజన్ల స్పందన:

వినోదాత్మకంగా ఇదొక ఓ చిన్న కేసే అయినా, నిత్య వాడకం వస్తువుల నాణ్యతపై వినియోగదారుల నిరాశను ప్రతిబింబిస్తుంది ఈ ఘటన. తినే ప్రతీ వస్తువు ఇలా క్వాలిటీ లేకుండా పోతే ఎలా అని నిలదీస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News