కడప జిల్లా పులివెందులలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వివేకా హత్యకేసు(Viveka murder case) నిందితుడు సునీల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. హత్య సినిమాలో తల్లి పాత్రపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని సునీల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని కలిశారు. ఇటీవల విడుదలైన హత్య సినిమాలో తనని క్రూరంగా చూపించారని ఆరోపించారు. దీంతో తనకు ప్రాణ హానీ ఉందని… వెంటేనే రక్షణ కల్పించాలని ఎస్పీ అశోక్ కుమార్ ని కోరినట్లు తెలిపారు.
వివేకా హత్య కేసులో తోటి నిందితులు తనను చంచల్ గూడ జైలులో బెదిరించారని చెప్పారు. వైసీపీకి చెందిన కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. అన్ని విషయాలపై ఎస్పీకి వివరించి ప్రాణ రక్షణ కల్పించాలని కోరినట్లు మీడియాతో సునీల్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఐదుగురిపై కేసు నమోదు అయింది.