Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుCheryala: అంత్యక్రియల కోసం ఉప్పొంగుతున్న వాగులో పాడే మోస్తూ..

Cheryala: అంత్యక్రియల కోసం ఉప్పొంగుతున్న వాగులో పాడే మోస్తూ..

వాగు అవతలి వైపు స్మశాన వాటిక, మరి వాగు దాటాలంటే..

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వాగులు ఉప్పొంగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సిద్దిపేట జిల్లాలో ఆఖరి మజిలీ కోసం అవస్థలు పడిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం ఉప్పొంగుతున్న వాగులో పాడే మోస్తూ గ్రామస్తులు, బంధువులు ఈదుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే చేర్యాల మండలంలోని వేచరేణి గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బసవరాజు బాలయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామస్తులు, బంధువులందరూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగు ఉప్పొంగింది. స్మశాన వాటిక వాగు అవతలి వైపు ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటి అంత్యక్రియలు నిర్వహించారు.

- Advertisement -

వంతెన నిర్మాణానికి టెండర్ పూర్తయినా పనులు చేపట్టని కాంట్రాక్టర్

చేర్యాల వేచరేణి గ్రామాల మధ్య వాగు ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం ఒక కోటి 96 లక్షలు కేటాయించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ పనుల జాప్యం వల్ల వేచరేణి గ్రామ సర్పంచ్ ఏనుగుల దుర్గయ్య అసహనం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా వెంటనే పనులు చేపట్టాలని ఈ టెండర్ ప్రక్రియ కాలపరిమితి అక్టోబర్ నెలలో ముగుస్తుందని సర్పంచ్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News