శాసనసభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మద్య నిషేధ ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఏ. శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా చేవెళ్ల పరిధిలో ఎక్సైజ్ శాఖ నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు 81,52,783 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈ మొత్తం16,238 లీటర్లు ఉందన్నారు. ఈ తనిఖీలలో 18మంది పై క్రిమినల్ కేసులు నమోదుచేసి ఒక కార్ ను స్వాధీనం చేసుకున్నామని వారు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల పరిధిలోని రిసార్ట్, ఫామ్ హౌస్ లలో జరిగే మద్యం పార్టీలపై పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. ఇతర రాష్ట్రల నుంచే వచ్చేఅక్రమ మద్యంపై ప్రత్యేక ద్రుష్టి సాదించమన్నారు.
రైల్వే స్టేషన్లు జాతీయ రహదారులుపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అక్రమంగా మద్యం నిలువ చేసిన రవాణా చేసిన చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీలత, ఎస్సైలు ఎం.వి.ప్రసన్న రెడ్డి, ఎన్. శ్రీనివాస్, ఏ. నరసింహ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.