Saturday, May 18, 2024
Homeనేరాలు-ఘోరాలుChevella: మైనర్ బాలిక రేప్ కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష

Chevella: మైనర్ బాలిక రేప్ కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష

రంగారెడ్డి జిల్లా స్పెషల్ కోర్టు

మైనర్ బాలికపై అత్యాచారం ఘటన జరిగే ఏడేళ్లు గడిచిన అనంతరం ముద్దాయికి 20 యేండ్ల శిక్షతో పాటుగా రూ.40 వేల జరిమానా విధిస్తూ ఎల్బీ నగర్ ఫస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ న్యాయమూర్తి హరీష తీర్పు వెలువరించారు. చేవెళ్ల ఏసీపీ బీ.కిషన్ చేవెళ్ల ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 2017 ఫిబ్రవరి 22వ తేదీ న అప్పటి చేవెళ్ల సీఐ గురవయ్య రేప్, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారన్నారు. సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండలం కిష్టపూర్ గ్రామానికి చెందిన రత్నయ్య అలియాస్ రత్నంకు ఓ మైనర్ బాలిక వీరిద్దరూ సెల్ఫోన్ ద్వారా పరిచయం కాగా… అది కాస్తా మైనర్ ను మభ్య పెట్టి పలుమార్లు అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. పలుమార్లు ఆ బాలిక తనను పెళ్లి చేసుకోవాలని కోరినా నిందితుడు అందుకు అంగీకరించకపోవడంతో బాలిక చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ బాలిక నిత్యం చేవెళ్ల బస్ స్టేషన్ వేదికగా చేసుకుని మాట్లాడుకునేవారు. అక్కడి నుంచి యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల్లో సంచరించారు. అద్దెకు గదిని తీసుకుని కొన్నాళ్ల పాటు అక్కడ కూడా ఉండేవారు. కాగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన ప్రతీసారీ సమాధానం దాటవేసేవాడని మైనర్ అమ్మాయి విసిగి చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి చేవెళ్ల సీఐ గురవయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడే విధంగా పక్కడ్బందీగా వివరాలను సేకరించారు. ఎ

- Advertisement -

ల్బీ నగర్ ఫస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ లో ట్రయల్ నడిచింది. ఏప్రిల్ 30న తీర్పు వెలువరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోమలత, కోర్టు కానిస్టేబుల్ సాక్షలను పకడ్బందీగా ఫస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుకు సమర్పించడంతో జడ్జీ ఈ తీర్పునిచ్చారు. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.40వేల జరిమానా విధించామన్నారు. కొత్త వ్యక్తులను నమ్మి మోసపోవద్దని … ఫోన్ కాల్ పరిచయాలతో సమాజంలోని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చిన్నదే అని క్యాజువల్గా తీసుకోవద్దన్నారు. మహిళలు, యువతులు, మైనర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి, ఎస్సై ప్రదీప్ కుమార్ లు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News