Saturday, May 18, 2024
Homeనేరాలు-ఘోరాలుTanduru: తాండూరు ఎస్ఐ సస్పెన్షన్

Tanduru: తాండూరు ఎస్ఐ సస్పెన్షన్

అలసత్వమే కారణం..

పీ.డీ ఎస్ రైస్ అక్రమ దందా కేసు వ్యవహారంలో తాండూరు ఎస్ఐ సస్పెండ్ అయ్యారు.

- Advertisement -

పీ.డీ ఎస్ రైస్ అక్రమ దందా కేసు వ్యవహారంలో దర్యాప్తు విషయంలో ఆలసత్వంతో వ్యవహారించినందుకు రామగుండం కమిషనరెట్ పరిధిలోని తాండూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్. ఐ కె. జగదీష్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఎ. వి రంగనాథ్ ఉత్తర్వులు జారీచేసారు.

ఎన్నికల నిర్వహణతో పాటు, నేర సమీక్ష కు రామగుండం కమిషనరేట్ కార్యాలయంకు వచ్చిన మల్టీ జోన్ 1 ఐజీ పీడీఎస్ రైస్ కేసులపై నిర్వహించిన సమీక్షలో గత నెల 20వ తారీఖున తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష జరిపారు. ఈ కేసులో తాండూరు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ జగదీష్ అలసత్వంతో వ్యవహరించడంతో పాటు, పలు ఆరోపణలు రావడంతో తాండూర్ పోలీస్ స్టేషన్ ఎస్. ఐ ని సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్టీ జోన్ 1 ఐజీ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News