చేవెళ్ళ మండలం చన్ వల్లి గ్రామంపై పకృతి కన్నెర్ర చేసింది. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ఉరుములు మెరుపులతో కూడిన భీకరమైన గాలి వాన చన్ వల్లి గ్రామానికి కుదిపివేసింది. గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయంలో ధ్వజస్తంభం సైతం నేల కూలింది. రైతులు లక్షలు వెచ్చించి నిర్మించిన్న పాలీ హౌజులు గాలివానకు చిద్రమాయ్యాయి. చేతి కొచ్చిన పూల పంటలు సైతం ధ్వంసమయ్యాయి. రైతు పొలంలో నిర్మించుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కింద పది పగిలిపోయాయి. పశువుల పాగలు రేకుల షెడ్లు గాలిలో ఎగిరిపోయాయి. ఈ పకృతి విపత్తు రైతుకు తీరని కన్నీళ్లను మిగిల్చింది. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేయాల్చి ఉంది. మంగలి నరసింహులు తండ్రి శంకరయ్య అనే రైతు సొంత భూమి అమ్మి 25 లక్షలతో అరకరంలో పాలీ హౌస్ నిర్మించాడు.కమ్మరి వెంకటేశం తండ్రి రాములు ఎకరం పొలంలో మూడు నెలల క్రితం 65 లక్షల ఖర్చుతో హాలియా హౌస్ నిర్మించాడు.మరో రైతు మాజీ సర్పంచ్ ఏం నర్సింలు 15 సంవత్సరాల క్రితం తన పొలంలో దిమ్మె నిర్మించి ట్రాన్స్ఫార్మర్ పెట్టాడు. బీకర గాలివానకు ట్రాన్స్ఫార్మర్ సైతం కిందపడింది.
ఆర్టికల్చర్ ఏడి సంజయ్ కుమార్:
చన్ వల్లి గ్రామంలో దాదాపు 100 ఉన్నాయి. ఇందులో 90 పాలి హౌసులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మూడు పాలి హౌస్ లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నాబార్డ్ సంస్థ జరిగిన నష్టాన్ని అంచన వేయాలి. ఒక్క నిర్మించడానికి 42 లక్షలు ఖర్చు అవుతుంది. మొదటి కోత కోయకముందే ఇలాంటి పకృతి విధ్వంసం జరగడం బాధాకరం. ఈ పాలి హౌసులు 2015లో నిర్మించినవి ఉన్నాయి. నిర్మాణ దశలోనే ప్రభుత్వం వీటికి 75% సబ్సిడీ ఇస్తుంది. ఎస్సీ ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ ఇస్తుంది. ఈ పాళీ హౌస్ 5సంవత్సరాలు దృఢంగా ఉంటాయి. పాలీ హౌస్ ను బహిరంగ ప్రదేశాల్లో నిర్మించినట్లయితే దాని చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద పెద్ద చెట్లు పెంచాల్సి ఉంటుంది. పకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు గాలి తీవ్రతను ఆ చెట్లు తగ్గిస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో నిర్మించడం వల్ల భారీ నష్టం కలిగింది. జరిగిన నష్టానికి రిపోర్టు రాసి కలెక్టర్ కు పంపిస్తామన్నారు.