Thursday, July 4, 2024
Homeనేరాలు-ఘోరాలుChevella: ఇసుక రవాణా అడ్డుకున్నందుకు వీఆర్ఏ పై దాడి

Chevella: ఇసుక రవాణా అడ్డుకున్నందుకు వీఆర్ఏ పై దాడి

పాత తాండూర్ వైపు కొనసాగిస్తున్న ఇసుక రవాణాను వెంటనే ఆపివేయాలని తహశీల్దార్ కి వినతి

ఇసుక అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇసుక రవాణాను అడ్డుకున్న వీఆర్ఏ పై దాడికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ పరిధిలోని పాతతాండూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాత తాండూరు మీదుగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను వీఆర్ఏ ఎల్లప్ప అడ్డుకోవడంతో అతడిపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పాత తాండూరు వాసులు ఆందోళన చేపట్టి పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు వెళ్లి దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. పాత తాండూర్ కు చెందిన కౌన్సిలర్లు వీఆర్ఏ పై దాడి చేసిన అబ్రాహర్ లాలపై వెంటనే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. పాత తాండూర్ వైపు కొనసాగిస్తున్న ఇసుక రవాణాను వెంటనే ఆపివేయాలని తహశీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. బడా నేతల అండ చూసుకొని రోజు రోజుకు అక్రమ ఇసుక రవాణా కు అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే దాడికి పాల్పడ్డ నిందితుడి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూర్ లో ఆక్రమ ఇసుకను అరికట్టాలని, దాడికి పాల్పడ్డ నిందితుడి పై చర్యలు తీసుకోవాలని తాండూర్ డిఎస్పికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పాత తాండూర్ కౌన్సిలర్లు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News