సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర ఆన్లైన్ ఐపీఎల్ క్రికెట్ బెట్టిగ్ లను నిర్వహిస్తున్న ఏడుగురు భూకీలను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు, వారి వద్ద నుండి ఒక కోటి 84 లక్షల రూపాయల నగదును, 36 మొబైల్ ఫోన్లను, మూడు లాప్టాప్ లను, ఒక ట్యాబ్, ఒక జియో రూటర్ ను స్వాధీనం చేసుకున్నారు, ఈ సందర్భంగా బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు, సైబరాబాద్ పరిధిలోనిశంషాబాద్,రాజేంద్రనగర్,బాలానగర్ ఎస్వోటీ పోలీసులు ఐపీఎల్ బెట్టింగ్ స్థావరాల పై దాడులు నిర్వహించారు,ఏడుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు, నిందితులు వజ్రా 777.కమ్, వజ్ర ఎక్స్ఛేంజ్, మెట్రో ఎక్స్ఛేంజ్, రాధే ఎక్స్ఛేంజ్, ఫోకస్ బుక్247, వర్మ 777 యాప్ మొదలైన యాప్‌ల ద్వారా బెట్టింగ్ వినియోగదారులను ఆకర్షించి ఆన్లైన్ ద్వారా డబ్బు తీసుకోవడం చేస్తారు, యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఇచ్చి డబ్బులు తీసుకుని పంటర్లకు యాక్సెస్ కల్పిస్తారు.ఎక్కువగా పంటర్లు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని తెలిపారు.డబ్బు ఫోన్ పే, గూగుల్ పే, పేటీయమ్ మొదలైన వాటి ద్వారా కొన్ని సందర్భాల్లో నగదు కూడా సేకరించేవారు, సైబరాబాద్ పోలీసు బాస్ ఆదేశాల ప్రకారం ఐపీఎల్ బెట్టింగుల పై గట్టి నిగ్గ పెట్టిన సైబరాబాద్ పోలీసులు శంషాబాద్,రాజేందర్ నగర్,బాలానగర్ ఎస్వోటీ పోలీసులు బెట్టింగ్ మాఫియా స్థావరాల పై దాడులు నిర్వహించారు, ఏడుగురు సభ్యులను అదుపులోకి తీసుకుని భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు,నిందితుల పై శంషాబాద్,రాజేంద్రనగర్, నర్సింగీ పోలీస్ స్టేషన్ లలోమూడు కేసులు నమోదు చేశారు, 2017 ఆన్ లైన్ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Cyberabad: అంతర్రాష్ట్ర ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగుల ముఠా గుట్టు రట్టు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES