Monday, May 13, 2024
HomeఆటCM Cup: 18 క్రీడాంశాలలో సీఎం కప్

CM Cup: 18 క్రీడాంశాలలో సీఎం కప్

సీఎం కప్ నిర్వహణ విధివిధానాలపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సిఎం కేసిఆర్ అదేశాల మేరకు రాష్ట్రం లో క్రీడల అభివృద్ధికి ప్రతి అసేంబ్లీ నియోజక వర్గంలో నూతనంగా 76 క్రీడా మైదానాల ఏర్పాటు కు అనుమతులను ఇచ్చినట్టు, ఇప్పటికే రాష్ట్రంలో 50 శాతం స్టేడియాలను పూర్తి చేశామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

- Advertisement -

సిఎం కెసిఆర్ అదేశాల మేరకు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దాదాపు 19 వేల గ్రామాలు, పట్టణాలలో క్రీడా ప్రాంగణాలను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిర్మిస్తున్నాము. ఇప్పటికే 15 వేల పైచిలుకు క్రీడా ప్రాంగణాలను పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. దీనివల్ల గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గాను దేశంలో ఏక్కడ లేని విధంగా సిఎం కప్ ను క్రీడా పోటిలు గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని సమీక్షలో వెల్లడించారు. సిఎం కప్ క్రీడల నిర్వహణకు సిఎం కెసిఆర్ కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు.

క్రీడాకారులకు,  కోచ్ లకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నాం. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్య అభ్యాసం కోసం 0.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు నగదు పురస్కారాలను గణనీయంగా పెంచినట్టు వివరించారు. ఎంతో విలువైన జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలలో ఇళ్ల స్థలాలను కేటాయించినట్టు, దేశానికి తెలంగాణ నుండి ఎక్కువ సంఖ్యలో క్రీడాకారులను అందించడమే లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. గత ఒలంపిక్స్, కామన్వెల్త్ క్రీడలలో తెలంగాణకు చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనపర్చామన్నారు. సీఎం కప్ నిరంతరం కొనసాగేలా విధి విధానాలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు.

రాష్ట్ర క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్, వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్లు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATS) ఉన్నతాధికారులు సీఎం కప్ నిర్వహణలో కీలక భూమిక పోషించాలన్నారు. సీఎం కప్ నిర్వాహణ పై జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుపై రేపు జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ జరుగనుంది. సీఎం కప్ ఈనెల 13న లోగో ఆవిష్కరణ జరుగనుండగా, 18 క్రీడాంశాలలో సీఎం కప్ నిర్వహిస్తారు. సీఎం కప్ నిర్వహణ లో ఈ నెల 15 నుండి 17 వరకు జరిగే మండల స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలలో స్థానిక ఎమ్మెల్యే లను భాగస్వామ్యం చేయాలన్నారు మంత్రి.

సీఎం కప్ నిర్వాహణ, విజయవంతం చేయడంపై రాష్ట్రానికి చెందిన అర్జున, పద్మశ్రీ, ద్రోణాచార్య, పద్మభూషణ్, పద్మ విభూషణ్ క్రీడా అవార్డులు సాధించిన క్రీడాకారులతో, క్రీడా ప్రమోటర్లతో ఈనెల 18న హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈ నెల 22న జిల్లా స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో జిల్లాకు చెందిన ఇంచార్జ్ మంత్రి నీ భాగస్వామ్యం చేయాలన్నారు. 29న జరిగే సీఎం కప్ ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలన్నారు మంత్రి. సీఎం కప్ అంతర్జాతీయ మానసిక వికలాంగుల క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – క్రీడా శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ విజయవంతం చేయడానికి వివిధ కమిటీల  నియామకం చేపట్టినట్టు తెలిపారు.

సీఎం కప్ నిర్వహణలో క్రీడాకారులకు అవసరమైన పలు కీలక కమిటీలైన ఫుడ్ కమిటీ, వసతి ఏర్పాటు, రవాణా సౌకర్యం, సీఎం కప్ ప్రారంభ ఏర్పాట్లపై జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నియమించారు. సాంకేతిక సహాయం తెలంగాణ ఒలంపిక్ కమిటీ చూసుకుంటుంది. స్టీరింగ్ కమిటీలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ  (SATS) ఉన్నతాధికారుల బాధ్యతని మంత్రి తెలిపారు. సీఎం కప్ విధి విధానాలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో క్రీడా శాఖ అధికారులకు, వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్లకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ దిశా నిర్దేశం చేశారు.

ఈ సమీక్షలో రాష్ట్ర క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ (SATS) చైర్మన్ డాక్టర్. ఆంజనేయ గౌడ్, OSD SATS డాక్టర్ K. లక్ష్మి, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్ యాదవ్, జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ చైర్మన్ జగన్ మోహన్ రావు, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్ ల అధ్యక్ష , కార్యదర్శులు, SATS ఉన్నతాధికారులు ధనలక్ష్మి, సుజాత, దీపక్, డాక్టర్ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News