Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుEmmiganur: ఎత్తేసిన రవీంద్ర భారతి స్కూల్

Emmiganur: ఎత్తేసిన రవీంద్ర భారతి స్కూల్

ఇక్కడ పని చేసిన స్టాఫ్ ను అడగ్గా ఎవరు సమాధానం చెప్పకుండా సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు

ఎమ్మిగనూరు పట్టణంలోని గీతా మందిర్ దగ్గర ఉన్న రవీంద్ర భారతి పాఠశాల యాజమాన్యం విద్యార్ధులకు వారి తల్లదండ్రులకు సమచారం ఇవ్వకుండా పాఠశాలను ఎత్తివేసిన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యార్ధులకు టీసీలు ఇప్పించాలి విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు రాజేశ్, శేఖర్, ఉదయ్, సురేష్, ఆఫ్రిద్, రఘు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై మస్తాన్ వలి కి ఫిర్యాదు చేశారు.ఈ సందర్భగా వారు మాట్లాడుతూ గతంలో ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న రవీంద్ర భారతి పాఠశాలకు సరైన అనుమతులు లేకున్నా విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసి దాదాపుగా 250 మంది విద్యార్థులను అడ్మిషన్లు చేర్చుకున్నారు. వేలకు వేలు ఫీజులు కూడా వసూలు చేశారు. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో అన్నీ పాఠశాలలు తెరచి తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ రవీంద్ర భారతి పాఠశాల మాత్రం తెరవకుండా మూసివేశారు. అందులో చేర్పించిన తల్లిదండ్రులూ ప్రతిరోజూ స్కూల్ చుట్టూ తిరుగుతున్నారు కానీ ఎవరు స్పందించడం లేదు. ఇక్కడ పని చేసిన స్టాఫ్ ను అడగ్గా ఎవరు సమాధానం చెప్పకుండా సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇలాగా వ్యవహరించడం వలన విద్యార్థుల తల్లిదండ్రుల తమ పిల్లల భవిష్యత్త్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్ధులకు టీసీలు ఇస్తే వేరే పాఠశాలలో అయిన చేర్పించుకుంటారు. ఈ విషయంపై విద్యాశాఖ అదికారులకు తెలియజేసినా స్పందించడం లేదు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ రఘు, రాజు, గని పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News