Monday, June 24, 2024
Homeనేరాలు-ఘోరాలుEmmiganuru: కుక్కల దాడిలో జింక మృతి

Emmiganuru: కుక్కల దాడిలో జింక మృతి

కలగట్ల గ్రామ పొలాల్లో..

ఎమ్మిగనూరు మండలం కలగట్ల గ్రామ సమీపంలో వ్యవసాయ పొలాల్లో కుక్కల దాడిలో జింక మృతి చెందింది. కలగట్లలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జింక పొలాలలో మేత మేయడానికి ఊరి దగ్గరకు వచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న కుక్కలు ఒక్కసారిగా జింకపై దాడి చేశాయి. గ్రామస్థులు గమనించి కుక్కల బారి నుండి జింకను విడిపించారు. అయితే జింక ప్పటికే మృతి చెందింది. గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు మృతి చెందిన జింకను పంచనామా నిమిత్తం తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News