Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుEncounter:గాయపడ్డ హిడ్మా, ఛత్తీస్ గఢ్ లో జోరుగా 'ఫ్రీ ఆఫ్ నక్సలిజం' ఆప్

Encounter:గాయపడ్డ హిడ్మా, ఛత్తీస్ గఢ్ లో జోరుగా ‘ఫ్రీ ఆఫ్ నక్సలిజం’ ఆప్

కోబ్రాల ఆపరేషన్స్ లో మావోయిస్టు అగ్రనేత 55 ఏళ్ల మాడ్వి హిడ్మా గాయపడ్డాడు. ఛత్తీస్ గఢ్ లో బుధవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ లో హిడ్మా గాయపడ్డాడు. ఇటీవలి కాలంలో పోలీసులు చేపట్టిన అతి భారీ ఆపరేషన్ గా దీన్ని పేర్కొంటున్నారు. బుధవారం నాడు పెద్ద ఎత్తున మావోలపై ఈ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. హెలిక్యాప్టర్స్, డ్రోన్స్, కమాండోస్, ఎలైట్ CoBRA యూనిట్, సెంట్రల్ పోలీస్ ఫోర్స్, ఛత్తీస్ గఢ్ పోలీసులు, తెలంగాణకు చెందిన గ్రేహౌండ్ స్పెషల్ ఫోర్సెస్ యూనిట్..అందరూ కలిసి మూకుమ్మడిగా హిడ్మా గ్రూప్ పై విరుచుకుపడ్డారు. హిడ్మా గ్రూప్ పేరు బెటాలియన్ 1. 2024ఎన్నికల సమయానికల్లా మావోయిస్టులను అణచివేస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ భారీ ఆపరేషన్ జరగడం విశేషం.

- Advertisement -

ఛత్తీస్ గఢ్, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలు కలిసే మారుమూల ప్రాంతంలో కోబ్రా యూనిట్లు హెలిక్యాప్టర్ నుంచి దిగుతుండగా ఈ దళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎన్కౌంటర్ స్టార్ట్ అయినట్టు అధికారులు వెల్లడించారు. కోబ్రా కమాండోస్, మావోల మధ్య జరిగిన భీకరమైన ఎదురు కాల్పుల్లో హిడ్మా గాయపడ్డట్టు సీఆర్పీఎఫ్ ఛత్తీస్ గఢ్ సెక్టర్ కు చెందిన ఇన్స్పెక్టర్ జనరల్ ప్రకటించారు. ఏరియల్ అటాక్స్ తో ఈ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. సుక్మా జిల్లాలోని ఎల్మగుండా క్యాంపులో హెలిక్యాప్టర్ చిక్కుకుపోగా, కొందరు కమాండోలు గాయపడ్డారు.

రెండు డజన్లకు పైగా దాడుల్లో హిడ్మా ప్రధాన నిందితుడు, మాస్టర్ మైండ్ గా రికార్డు ఉంది. 2004 నుంచి పలు మావోల ఆపరేషన్స్ కు హిడ్మానే హెడ్ గా వ్యవహరిస్తున్నారు. 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను 2013లో దంతేవాడలో మట్టుబెట్టిన ఘటనలోనూ హిడ్మానే ప్రధాన సూత్రధారి. ఇతని తలపై 45 లక్షల రివార్డు ఉంది.

కాగా హిడ్మా చనిపోలేదని మావోలు ఇప్పటికే లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News