విద్యుత్ ఘాతంతో పాడి గేద మృతి చెందిన సంఘటన గార్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి వచ్చిన అకాల గాలివానతో విద్యుత్ వైర్లు తెగి కిందపడ్డాయి. కాగా మంగళవారం ఉదయం బాడిసే లక్ష్మికి చెందిన పాడి గేదలు మేత కోసం వెళ్ళగా మేత మేస్తూ, ఓగెద కింద పడిన విద్యుత్ వైర్లు తగిలి షాక్ తో మృతి చెందింది. మృతి చెందిన గేద విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. పాడి సంపదే ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంది.
Garla: విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి
ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES