Saturday, May 25, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: మహిళపై దాడి కేసులో..

Garla: మహిళపై దాడి కేసులో..

కోడలి అరెస్ట్

భూ వివాదంలో అత్తపై కోడలు దాడి చేసిన ఘటన చిన్న సరిహద్దు తండాలో ఐదు నెలల క్రితం చోటుచేసుకుంది. ఎస్ఐ జీనత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గార్ల మండల పరిధిలోని సరిహద్దు తండా గ్రామంలో తేజావత్ అచ్చాలి కోడలు తేజావత్ గంగకు మధ్య ఐదు నెలల క్రితం భూమి విషయంలో వివాదం జరగగా ఆగ్రహంతో గంగ తన అత్త అచ్చాలిని రాయితో కొట్టగా అచ్చాలికి గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో ఉటా ఉట్టిన హాస్పిటల్ తరలించారు అచ్చాలి కూతురు బానోతు సోమీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముద్దాయి అయిన తేజావత్ గంగను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం మహబూబాబాద్ కోర్టుకు పంపించినట్టు ఎస్సై తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News