Sunday, December 8, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: ముందస్తుగా డీజే నిర్వాహకుల బైండోవర్

Garla: ముందస్తుగా డీజే నిర్వాహకుల బైండోవర్

ముందస్తు చర్యల్లో..

రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డీజే సౌండ్స్ ను ఉపయోగించి ఎన్నికల నియమావళి భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదని ముందస్తు చర్యల్లో భాగంగా గార్ల మండల పరిధిలోని పూసల తండ గ్రామానికి చెందిన భూక్య సుధీర్ మూడ్ తండా గ్రామానికి చెందిన బోడా శ్రీకాంత్ పులిగుట్ట తండా గ్రామానికి చెందిన వాంకుడోత్ కళ్యాణ్ లను అదుపులోకి తీసుకొని, బైండోవర్ చేసి, తాసిల్దార్ ఎదుట హాజరు పరిచారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా వీరిని బైండోవర్ చేసినట్టు, మండలంలోని ఇతర డీజే నిర్వాహకులను కూడా తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేస్తామని ఎస్ఐ జీనత్ కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News